Indian Army: దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని కోసం యువతను ఎప్పుడు సిద్ధం చేయాలని భావిస్తోంది. దాయాది దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణ రంగంపై ఫోకస్ పెడుతోంది. దీనికి యువతను సైన్యంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. సైన్యంలో చేరే యువతకు అన్ని అర్హతలు సూచిస్తోంది. అగ్నిపథ్ అనే పథకం ద్వారా దేశ యువతను సైన్యంలో చేర్చుకోవాలని దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రక్రియను ప్రకటించింది. దీంతో వచ్చే మూడు నెలల్లో నియామక ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి నియామకాలు చేపట్టనుంది. తొలి దశలో 45 వేల మందిని తీసుకోనున్నారు. వారికి ఆరు నెలల శిక్షణ అనంతరం మూడున్నరేళ్లు సర్వీసులో చేర్చుకుంటారు. తరువాత 25 శాతం మందికి శాశ్వత ప్రాతిపదికన కమిషన్ లో చేర్చుకుంటారు. నాలుగేళ్ల అనంతరం అగ్నివీర్ సర్టిఫికెట్ తో ఉద్యోగ విరమణ తరువాత కూడా ఉపాధి చూపించనున్నట్లు తెలుస్తోంది.
సర్వీసు కాలంలో రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లిస్తారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం రూ.11 లక్షల నిధి అందజేస్తారు. అంతే కాదు రూ.16 లక్షలు రుణంగా అందజేస్తుంది. దీంతో అగ్నిపథ్ లో చేరేందుకు యువత రెడీగా ఉండాలని సూచిస్తోంది. దీనికి గాను యువత చూపిన ప్రతిభతో వారికి అంచెలంచెలుగా స్థాయిలు కేటాయిస్తారు. ఉద్యోగంలో చూపే ప్రతిభ ఆధారంగా వారికి అవకాశాలు కూడా కల్పిస్తారు. అగ్నిపథ్ ద్వారా సైన్యం సంఖ్య పెంచుకుని శత్రు దేశాలకు సవాలు విసిరేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లుగా వస్తున్న పాకిస్తాన్, చైనా కవ్వింపులకు సరైన సమాధానం చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే సైన్యం సంఖ్య పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అగ్నిపథ్ కోసం యువత కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సైన్యానికి ఖర్చు చేసే నిధులు పెరిగిపోవడంతో భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో చేరే వారికి పింఛన్ సదుపాయం ఉండదు. అందుకే ప్రభుత్వంపై భారం తగ్గనుంది. అందుకే ప్రభుత్వంపై భారం తగ్గించుకునే క్రమంలోనే అగ్నిపథ్ కు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. యువత అగ్నిపథ్ లో చేరి రక్షణ రంగంలో మరిన్ని సేవలు అందించాలని కోరుతున్నారు.