బ్యాంకు లావాదేవీ ఫెయిలైందా.. అయితే రోజుకు 100 పొందే ఛాన్స్..?

మనలో చాలామంది తరచూ బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో లావాదేవీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా జరగడం వల్ల మన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు కట్ అయినా అవతలి వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాదు. ప్రతిరోజూ వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్ ఖాతాదారులు ఇలా జరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ఆ డబ్బులు వెనక్కు రావడానికి చాలా రోజుల సమయం పడుతోంది. Also Read: బ్యాంకులో డబ్బులు […]

Written By: Kusuma Aggunna, Updated On : December 5, 2020 4:13 pm
Follow us on


మనలో చాలామంది తరచూ బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో లావాదేవీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా జరగడం వల్ల మన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు కట్ అయినా అవతలి వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాదు. ప్రతిరోజూ వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్ ఖాతాదారులు ఇలా జరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు ఆ డబ్బులు వెనక్కు రావడానికి చాలా రోజుల సమయం పడుతోంది.

Also Read: బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లకు ఆర్బీఐ శుభవార్త..?

అయితే ఇలాంటి ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా లావాదేవీ ఫెయిల్ అయితే వారం రోజుల్లోగా బ్యాంక్ అకౌంట్ లో నగదు జమ కావాల్సి ఉంటుంది. వారం కంటే ఆలస్యమైతే రోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంకులు పరిహారం ఖాతాదారునికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి ఖాతాదారులు ఈ పరిహారం పొందవచ్చు.

Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ..?

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించే వాళ్లు కూడా బ్యాంకుల నుంచి రోజుకు 100 రూపాయల చొప్పున పరిహారం పొందవచ్చు. అయితే బ్యాంకులో ఫిర్యాదు చేస్తే మాత్రమే పరిహారం పొందే అవకాశం ఉంటుంది. లావాదేవీ ఫెయిల్ అయ్యి నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాకపోతే లావాదేవీలకు సంబంధించిన ప్రూఫ్ లను తీసుకొని వెళ్లి ఫిర్యాదుతో పాటు సమర్పించాలి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లోనే లావాదేవీలు ఎక్కువగా ఫెయిల్ కావడం జరుగుతోంది. ఇకపై ఎప్పుడు లావాదేవీ ఫెయిల్ అయినా వెంటనే బ్యాంకులో సమాచారం ఇచ్చి పరిహారం పొందవచ్చు.