HomeజాతీయంChandrayaan-3: అదేజరిగి ఉంటే.. విక్రమ్ లేచి ఉండేదే..

Chandrayaan-3: అదేజరిగి ఉంటే.. విక్రమ్ లేచి ఉండేదే..

Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధృవం మీద కాలుమోపినప్పుడు జాతి యావత్ మొత్తం సంబరాలు చేసుకుంది. చంద్రుడి మీద హీలియం నిల్వలు ఉన్నాయి, సల్ఫర్ ఆనవాళ్లు ఉన్నాయని చెబితే జేజేలు పలికింది. ఇస్రో శాస్త్రవేత్తలను ఆకాశానికి ఎత్తేసింది. ఇక మనకు తిరుగులేదు అనుకుంది. కానీ ఈ లోగానే చంద్రుడి మీద చిక్కటి చీకట్లు అలముకున్నాయి. 14 రోజులపాటు వెలుతురు అనే ఆనవాళ్లు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అక్కడ సూర్యోదయం అయింది. ఆ సూర్యుడి శక్తి ద్వారా విక్రమ్ ల్యాండర్ లేస్తుంది అనుకున్నారు. పట్టువదలని శౌర్యంతో దేశం ప్రతిష్టను పెంచుతుంది అని భావించారు. వారు అనుకున్నది ఒక్కటి.. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద జరుగుతోంది మరొకటి.

చంద్రుడి దక్షిణ ధ్రువం మీదికి వెళ్లిన భారత విక్రమ్ ల్యాండర్.. అందులో నుంచి బయటకు వెళ్లి చక్కర్లు కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్ లు.. చంద్రుడి పై 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ నిద్రలేవాలని యావత్ ప్రపంచం కోరుకుంది. ముఖ్యంగా ఇస్రో శాస్త్రవేత్తల బృందం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. సెప్టెంబర్ 22న అక్కడ తెల్లవారింది గాని ఆ వ్యోమ నౌకల నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. ఫలితంగా అవి మేల్కొని, తిరిగి పరిశుద్ధులను చేస్తాయని ఆశలు రోజురోజుకు సన్నగిల్లిపోతున్నాయి. అయితే వెళ్లేటప్పుడు వెంట కొలిమి లాంటి ఓ సాధనాన్ని తీసుకువెళ్లి ఉంటే విక్రం ఇప్పటికల్లా క్రియాశీలమై ఉండేదని, మళ్లీ తన పరిశోధనలు ప్రారంభించేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విక్రమ్, ప్రజ్ఞాన్ కు సౌర శక్తే ఆధారం. అందువల్ల అవి చంద్రుడి ఉపరితనంపై 14 రోజులు పగటి సమయంలోనే పనిచేస్తాయి. ఆ తర్వాత వచ్చిన 14 రోజుల రాత్రి వేళల్లో మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. అంతటి శీతల వాతావరణంలో రెండు వారాలు కొనసాగడం వల్ల వ్యోమ నౌకల్లోని కొన్ని లోహభాగాలు పెళుసు బారుతాయి. ఫలితంగా అవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ తిరిగి సూర్యోదయం అయినప్పటికీ, వేడి వాతావరణం నెలకొన్నప్పటికీ.. అవి పని చేయలేని దుస్థితి ఏర్పడుతుంది.

ఏమిటి ఈ కొలిమి?

వ్యోమనూకల్లో పరమాణు జనరేటర్ లను ఏర్పాటు చేస్తే శీతల వాతావరణంలోనూ పరికరాలను వెచ్చగా ఉంచవచ్చు. వీటిని రేడియో ఐసోటోపిక్ హీటర్ యూనిట్ ( ఆర్ హెచ్ యూ) గా పేర్కొంటారు. ఇందులో ఎక్కువగా ఫ్లూటోనియం_238 ను ఇంధనం గా వాడుతుంటారు. ఈ పదార్థం సహజ సిద్ధ లేదా రేడియో ధార్మిక క్షీణతకు గురవుతుంటుంది. దీనినే సాంకేతిక భాషలో “ఆల్ఫా డీకే” అని పిలుస్తుంటారు. అలా క్షమించక్రమంలో భారీగా ఉష్ణ శక్తి వెలువడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం పరమాణు జనరేటర్లలో కీలక సూత్రం. ఆర్ హెచ్ యూ లు ఉత్పత్తి చేసే ఉష్ణాన్ని విద్యుత్ గా మార్చే సాధనాన్ని రేడియో ఐసోటోపిక్ ధర్మో ఎలక్ట్రిక్ జనరేటర్లుగా ( ఆర్ టీ జీ) పేర్కొంటారు. అందులోని ధర్మో కపుల్ ( సీ బ్యాక్ ఎఫెక్ట్) సహాయంతో అది కరెంటుగా మారుతుంది. దానిని బ్యాటరీల్లో నిల్వ చేయవచ్చు. హీటర్లు అందించే వేడితో వ్యూమనౌకల్లోని సున్నితమైన భాగాలను వెచ్చటి వాతావరణంలో ఉంచవచ్చు. రేడియో ధార్మిక క్షీణత ప్రక్రియ దశాబ్దాల పాటు సాగుతుంది. అందువల్ల ఆర్టిజి అన్ని సంవత్సరాల పాటు నిరాటంకంగా విద్యుత్ అందించగలదు. ఇక కిలో ఫ్లూటోనీయంతో 80 లక్షల కిలో వాట్ల మేర కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. ఆర్ టీ జీల్లో కదిలే భాగాలు ఉండవు. అందువల్ల వాటికి సర్వీసింగ్ అవసరం లేదు.

ఇక అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1977లో ప్రయోగించిన వాయేజర్_1,2 వ్వమనవకలు సౌర కుటుంబాన్ని దాటి వెళ్లాయి. అక్కడ సూర్యకాంతి స్వల్పంగా కూడా అందుబాటులో ఉండదు. అయినప్పటికీ అవి నిరాటంకంగా పనిచేస్తున్నాయి. కారణం వాటిలోని ఆర్టీజీలే. పయనీర్, వైకింగ్, కసీని, న్యూ ఒరైజన్స్, క్యూరియాసిటీ, పర్చెవ రైన్స్ వంటి వ్యోమ నౌకల్లోనూ నాసా ఈసాధనలను ఏర్పాటు చేసింది. 1970 నవంబర్ 17న చంద్రుడిపై మొదటి రోవర్ ను దించిన దేశంగా సోవియట్ యూనియన్ ఘనత సాధించింది. లూనో ఖోడ్_1 అనే ఆ వ్యోమ నౌక.. జాబిల్లి ఉపరితలపై పది నెలల్లో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సౌర ఫలకాల సహాయంతోనే దానికి ఆ శక్తి అందింది. రాత్రి వేళలో మాత్రం పొలోనియం_210 రేడియో ఐసోటోప్ హీటర్ దాన్ని వెచ్చగా ఉంచేది. 2013లో జాబిల్లి పైకి చైనా పంపిన చాంగే_3 ల్యాండర్, యుతు రోవర్ లలోనూ ఇలాంటి హీటింగ్ సాధనలే ఉన్నాయి. యుతు.. తొలిరాత్రి జాబిల్లిపై మనుగడ సాగించింది. రెండవ రాత్రి మొరాయించింది. 2018లో చందమామ అవతలి భాగంలో తొలిసారిగా చైనా దించిన చాంగే_ల్యాండర్, యుతు_2 రోవర్ మాత్రం ఆర్టిజిల సహాయంతో నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. చంద్రయాన్_3 కి ల్యాండింగ్ కు ముందు జాబిల్లి దక్షిణ ధృవం పై దిగే క్రమంలో కూలిపోయిన లూనా_25( రష్యా) లోనూ ఆర్ జి టి సాధనం ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular