బీజేపీలో చేరికపై తేల్చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్

ఇటీవలే పంజాబ్ సీఎంగా రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇందుకోసే ఆయన ఢిల్లీ పర్యటించారని అందరూ అనుకున్నారు. సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయగానే బీజేపీ నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.  దీనిపై కెప్టెన్ అమరీందర్ స్పందించాడు. తాను బీజేపీలో చేరతానని వచ్చిన వార్తల గురించి కెప్టెన్ సింగ్ వివరణ ఇచ్చారు. తను కాషాయ పార్టీలో చేరబోనని, […]

Written By: Suresh, Updated On : September 30, 2021 3:38 pm
Follow us on

ఇటీవలే పంజాబ్ సీఎంగా రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇందుకోసే ఆయన ఢిల్లీ పర్యటించారని అందరూ అనుకున్నారు. సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయగానే బీజేపీ నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.  దీనిపై కెప్టెన్ అమరీందర్ స్పందించాడు. తాను బీజేపీలో చేరతానని వచ్చిన వార్తల గురించి కెప్టెన్ సింగ్ వివరణ ఇచ్చారు.

తను కాషాయ పార్టీలో చేరబోనని, కాంగ్రెస్ లో కూడా కొనసాగనని ఓ జాతీయ వార్తా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ సింగ్ స్పష్టం చేశాడు. తాను ఇప్పటి వరకూ కాంగ్రెస్  పార్టీలో ఉన్నానని, తనను తీవ్ర క్షోభకు గురిచేసిన పార్టీలో ఇక ముందు కొనసాగబోనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశంతో పంజాబ్ సీఎంగా కెప్టెన్ వైదొలగిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. ఇక సీఎం చరణ్ జిత్ సింగ్ తో సిద్దూ గురువారం భేటీ కానుండడంతో పంజాబ్ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అయితే కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరకుంటే స్వతంత్రంగా పంజాబ్ లో ఒక పార్టీ స్థాపించడానికి కేంద్రంలోని బీజేపీ సహకరించే అవకాశముంది. తద్వార పరోక్షంగా పంజాబ్ లో పట్టు కలిగి ఉండాలని భావిస్తోంది. హర్యానా మంత్రి అనిల్ విజ్, కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే కూడా ఆయనను బీజేపీలో చేరాలని సూచనలు చేశారు. కానీ కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం తన రాజీనామా తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా వరకు మౌనంగా ఉన్నారు. పార్టీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీలో చేరికపై క్లారీటీ ఇచ్చారు.