చూడటానికి సన్నగా ఉన్నా కానీ బంతిని మాత్రం బౌండరీ అవతల బాల్ పడేలా కొడతాడు. అతడు క్రీజు లో ఉన్నంత సేపు సిక్సర్ల వర్షం కురిపిస్తునే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తాడు. అతడే హార్దిక్ పాండ్య.. అయితే జట్టులో ఎలాంటి పాత్ర పోషించాలి అనే విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు.

హార్దిక్ పాండ్య మొదట బ్యాట్స్ మన్. బౌలింగ్ చేయడం లేనే కేవలం బోనస్. అతడు ఇప్పటికీ బౌలింగ్ చేయడానికి ఫిట్ గా లేడు. బ్యాట్ తో మ్యాచ్ లను గెలిపించగలడు. టీ20 ప్రపంచకప్ లో పూర్తిస్థాయి బ్యాటర్ గా బరిలోకి దిగాలి. అలాంటి ఆటగాడు. ఎల్లప్పుడూ నా జట్టులో ఉంటాడు అని సెహ్వాగ్ అన్నాడు. భారత్ మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా పాండ్య గురించి మాట్లాడాడు. హార్దిక్ ముందుగా బ్యాట్స్ మన్ గా చూడాలి. బ్యాట్స్ మెన్ ఎదగాలంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపించాలి.
ప్రస్తుతం అతడు ముందుగా వచ్చి నిరూపించుకున్నాడు. మధ్య ఓవర్లలో చాలా బాగా ఆడగల నైపుణ్యం ఉంది. ముంబయి ఇండియన్స్ అతడిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా పంపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అని అజయ్ జడేజా అన్నాడు. ఇక కొన్నాళ్ల క్రితం హార్దిక్ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటినుంచి బౌలింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరఫున కూడా బౌలింగ్ చేయడం లేదు. హార్దిక్ ఇప్పటికీ బౌలింగ్ చేయడానికి ఫిట్ గా లేడు.