https://oktelugu.com/

ఆ నూనెలకు గంగూలీ గుండెపోటు సెగ

బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ ఇటీవల గుండె పోటు బారిన పడ్డారు. ఈ దుర్ఘటన కాస్త అదానీ సంస్థకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్‌కు చెందిన ‘ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్‌’కు దాదా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. ఆ కంపెనీ యాడ్‌లో ఆరోగ్యమైన గుండె కోసం, రోగనిరోధకశక్తిని పెంచేందుకు అంటూ గంగూలీ చెబుతారు. అలాంటి వ్యక్తి నేడు గుండెపోటుకు గురికావడంతో ఆ యాడ్ తీవ్ర విమర్శల పాలైంది. Also Read: వాళ్లు రాజీకి వచ్చారు..! […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 6, 2021 3:04 pm
    Follow us on

    Sourav Ganguly Fortune Oil ads
    బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ ఇటీవల గుండె పోటు బారిన పడ్డారు. ఈ దుర్ఘటన కాస్త అదానీ సంస్థకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్‌కు చెందిన ‘ఫార్చ్యూన్ రైస్‌బ్రాన్ ఆయిల్‌’కు దాదా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. ఆ కంపెనీ యాడ్‌లో ఆరోగ్యమైన గుండె కోసం, రోగనిరోధకశక్తిని పెంచేందుకు అంటూ గంగూలీ చెబుతారు. అలాంటి వ్యక్తి నేడు గుండెపోటుకు గురికావడంతో ఆ యాడ్ తీవ్ర విమర్శల పాలైంది.

    Also Read: వాళ్లు రాజీకి వచ్చారు..! : ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాక్సిన్లు

    ఇక సోషల్‌ మీడియా వేదికగా ఫార్చ్యూన్ రైస్ బ్రాండ్ ఆయిల్‌పై సెటైర్లు వస్తూనే ఉన్నాయి. అదానీ కంపెనీ ఆయిల్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌కే గుండె పోటని కామెంట్ల వర్షం కురిసింది. దీంతో అదానీ గ్రూప్ అప్రమత్తమైంది. చాలా తెలివిగా ఆ ప్రకటనను నిలిపివేసింది. అంతేకాదు దాదా ఉన్న అన్ని ప్రకటనలను ఆపేసింది. ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక.. ఆయనతో మాట్లాడి కొనసాగిస్తామని, ఇది తాత్కాలిక విరామం మాత్రమేనని అదానీ గ్రూప్ తెలిపింది.

    Also Read: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత జట్టు ఇదే?

    సాధారణంగా అభిమాన సినీ నటులు.. క్రికెట్‌ ఆటగాళ్లు ఏదైనా యాడ్‌ చేస్తే అభిమానులు వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా హెల్త్‌ విషయంలో వాటిని పాటించేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే.. ఎంతో మంది అభిమానులున్న గంగూలీ ఓ ఆయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బాడీలో ఫ్యాట్‌ పెరిగేతేనే గుండె పోటుకు దారితీస్తుంటుంది. అయితే.. ఇప్పుడు గంగూలీ ఫార్చ్యూన్‌ ఆయిల్‌ వాడండని చెప్పిందంతా ఉత్తదేనా అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్