cyrus mistry టాటా గ్రూప్ మాజీ చైర్మన్ , ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మరణించడం పారిశ్రామికవర్గాల్లో విషాదం నింపింది. ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం తర్వాత, మిస్త్రీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.

ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ తో సహా సైరస్ మిస్త్రీ మరణించారు. వారితోపాటు ప్రయాణిస్తున్నమరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని గుజరాత్ లోని ఆస్పత్రికి తరలించారు.
అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో వస్తుండగా సూర్య నది వంతెనపై డీవైడర్ ను ఢీకొన్న ప్రమాదంలో సైరస్ మిస్త్రీ మరణించారు. కారులో నలుగురు ఉండగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ 2016లో తొలగించింది. ఆయన నాయకత్వంపై అపనమ్మకాలు ఏర్పడడం.. వ్యవహార శైలి నష్టాలు చేకూర్చేవిధంగా ఉండడంతో బలవంతంగానే పక్కనపెట్టింది.
2012లో రతన్ టాటా రాజీనామా చేసిన తర్వాత సైరస్ మిస్త్రీకి టాటా సన్స్ చైర్మన్ పదవి లభించింది. అయితే.. 4 సంవత్సరాల తర్వాత ఆయన ఈ పదవి నుంచి తొలగించబడ్డారు.
1968 జులై4న సైరస్ మిస్త్రీ జన్మించారు. ప్రఖ్యాత పల్లోంజీ వ్యాపార కుటుంబం వీరిది. భారత నిర్మాణ దిగ్గజం పల్లోంజి మిస్త్రీకి చిన్న కుమారుడు సైరస్. టాటాలతో వ్యాపార భాగస్వామ్యం ఉంది. ఆ కోవలోనే రతన్ టాటా తర్వాత సైరస్ కు 2012లో చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. 2016 అక్టోబర్ 24న సైరస్ ను పలు ఆరోపణలతో తొలగించారు. ఈయన గ్రూప్ 6వ చైర్మన్ గా చేశారు.
Maharashtra | Former Chairman of Tata Sons, Cyrus Mistry died in a car crash at around 3pm in the Palghar area today
A total of four people were travelling in the vehicle; two, including Cyrus Mistry, died, said police. pic.twitter.com/n48hZirTeQ
— ANI (@ANI) September 4, 2022