Homeక్రైమ్‌Dharmasthali Case Controversy: ధర్మస్థలి కేసు వివాదం.. ఇప్పుడు రివర్స్‌ కేసులు పెడుతున్న పోలీసులు

Dharmasthali Case Controversy: ధర్మస్థలి కేసు వివాదం.. ఇప్పుడు రివర్స్‌ కేసులు పెడుతున్న పోలీసులు

Dharmasthali Case Controversy: ధర్మస్థలి.. కర్ణాటకలోని అతి పవిత్రమైన స్థలం. ఇక్కడి మంజేనాథస్వామి ఆలయం ఉంది. అయితే ఈ ఆలయంపై దాదాపు ఆరు నెలల కాలంగా వివాదం మొదలైంది. ఓ వ్యక్తి.. తాను ఆలయలో గతంలో పనిచేశానని, ఆ సమయలో తనతో వందల శవాలు పూడ్చివేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయినా కొందరు దీనిపై రచ్చచేశారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీశారు.

విచారణలో లభించని ఆధారాలు..
ఆలయంలో పనిచేసిన వ్యక్తి చెప్పినట్లుగా పోలీసులు తవ్వకాలు జరిపారు, ఆనవాళ్లు సేకరించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తు సంస్థ ఆధారాల సేకరణ నిలపివేసింది. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా భావించారు. ఈ క్రమంలో ఆరోపణలన్నీ కట్టుకథలే అని తేల్చారు.

కుట్రదారులపై కేసులు..

ఇటీవలే బెల్తంగడి పోలీస్‌ స్టేషన్‌లో భారతీయ న్యాయసంహితా సెక్షన్‌ 215 ప్రకారం కొంతమందిపై కేసులు నమోదు చేశారు. నివేదికల ప్రకారం ఆ కేసులు ధర్మస్థలతో సంబంధం ఉన్న అసత్య ఆరోపణలందే అని తెలిపే రొజులు వస్తున్నాయి. మహేశ్‌ తిమ్మిరిడి, గణేశ్‌ మట్టన్నవార్, విఠల్‌ గౌడ, జయంత్‌.టి, సుజాత గౌడ వంటి వ్యక్తులను ఈ కేసుల్లో చేర్చినట్లు సమాచారం. అదనంగా, ‘తాను వెయ్యి శవాలు పాతానని‘ చెప్పిన వ్యక్తిపై కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితే ప్రస్తుత సమాజంలో ధర్మస్థల కార్యకలాపాల పట్ల పక్షపాత వార్తల్ని, లక్ష్యంచేసిన వ్యక్తులపై ముట్టడిని మొదలుపెట్టినట్లు భావించవచ్చు.

ఇలా వివాదాలకు చుట్టూ ఉత్పన్నమైన రాజకీయ, సామాజిక చర్చలు, వివరిస్తున్న కేసుల నేపథ్యంలో, ధర్మస్థల కట్టుకథలపై స్థూల సమీక్ష అవసరమని భావిస్తున్నారు. వాస్తవాలు బయటపడే దిశగా నిష్పక్షపాత విచారణలు, నివేదికలు అవసరం. అప్పుడు మాత్రమే సమాజంలో ఈ వ్యవహారం ప్రతిస్పందనగా స్వీకరించబడగలదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version