1996 Calendar: కొత్త ఏడాది వచ్చేసింది. కాల గమనంలో 2023 అంతరించిపోయింది. కొత్త ఏడాది 2024 వచ్చేసింది. వారం రోజులు గడిచిపోయాయి. అందరూ కొత్త క్యాలెండర్లు తెచ్చుకుని ఇళ్లలోపెట్టుకున్నారు. అయితే కొందరు 1996 క్యాలెండర్ వెలికి తీస్తున్నారు. లేనివాళ్లు.. కావాలని, ఎక్కడ దొరుకుతుందా అని ఆరా తీస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజమే 2024లో కూడా 1996 క్యాలెండర్ వెతకడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
1996 రిపీట్..
నిజానికి 2024లో వచ్చిన క్యాలెండర్ పూర్తిగా 1996 క్యాలెండర్ రిపీట్ అయింది. అంటే 2024 జనవరి 1.. సోమవారంతో మొదలైంది. 1996, జనవరి 1 కూడా సోమవారమే మొదలైంది. 1996 లీప్ ఇయర్. 2024 కూడా లీప్ ఇయరే. దీనిని బట్టి చూస్తే క్యాలెండర్ చక్రం మళ్లీ మొదలైనట్లు అనిపిస్తుంఇ. దీనికి సంబంధించిన పోస్టులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1996 ఈజ్ బ్యాక్ అంటూ కొందరు, 1996 = 2024 అని క్యాప్షన్ ఇచ్చి వీడియోలను వైరల్ చేస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని గుర్తించిన కొందరు వ్యాపారులు, కొన్ని ఈకామర్స్ సంస్థలు 1996 క్యాలెండర్ మాదిరిగానే దాని మీద వివిధ కవర్ ఫొటోలతో అమ్మకానికి పెడుతూ డబ్బు సంపాదిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో క్యాలెండర్లు..
1996 సంవత్సరం 2024లో రిపీట్ అయిన విషయం తెలుసుకున్న చాలా మంది ఇప్పుడ పాత క్యాలెండర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఇక కొంతమంది వ్యాపారులు పాత క్యాలెండర్‌ను కొత్తగా ముద్రించి విక్రయిస్తున్నారు. పాత క్యాలెండర్ ధర 50 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు ఉంది. మన కరెన్సీలో రూ.4 వేల నుంచి రూ.16 వేలు పలుకుతోందన్నమాట. 1996 క్యాలెండర్‌లో చైల్డ్ స్టార్‌గా ఫేమస్ అయిన జొనాథన్ టేలర్ థామస్ ఫోటో ఉన్న క్యాలెండర్ల కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
1996లో ఇవి కూడా..
1996 క్యాలెండర్‌లో ఉన్న డేట్స్ మాత్రమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్న్, ఒలింపిక్ గేమ్స్ వంటివి కూడా దాదాపుగా ఒకేలా ఉన్నట్లుల తెలుస్తోంది. 1996లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది ఒలింపిక్ గేమ్స్ నిర్వహించారు. ఇప్పుడు 2024లో కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఒలింపిక్స్ గేమ్స్ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.