Delhi High Court: మన దేశ వివాహ వ్యవస్థ చాలా గొప్పది. మన సంస్కృతి కూడా అంతకంటే గొప్పది. అందువల్లే మన దేశ వివాహ వ్యవస్థను ప్రపంచ దేశాలు ఆచరిస్తుంటాయి. ఆదరిస్తుంటాయి. అనుసరిస్తుంటాయి. ఇటీవల కాలంలో మనదేశ వివాహ దేవస్థానం ఇతర దేశస్థులు కూడా అనుసరిస్తున్నారు. ఏకంగా మన దేశానికి వచ్చి మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటున్నారు. వాస్తవానికి మన వివాహ వ్యవస్థలు కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి. వాటివల్లే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. ఒకరంటే ఒకరికి ప్రేమ కలుగుతుంది. ఒకరి కోసం ఒకరు జీవించాలని కోరిక కూడా బలోపేతమవుతుంది.
దాంపత్య జీవితం సజావుగా ఉన్నంతవరకు పెద్దగా ఇబ్బంది ఉండదు. దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే అప్పటినుంచి సంసారం లో చీలికలు ఏర్పడతాయి. అవి కాస్త వివాహేతర సంబంధాలకు దారితీస్తాయి. గతంలో పెట్టిన చట్టపరమైన నేరాలుగా భావించేవారు. అయితే ఇదంతా నేరం కాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చింది. ఇటీవల ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇటువంటి సంబంధాల మీద సరికొత్త చర్చకు దారి తీసింది. వాస్తవానికి వివాహ వ్యవస్థలో ఆ నైతిక సంబంధమనేది ఒక నేరం కాకపోవచ్చు గాని.. ఇది అంతిమంగా భార్యాభర్తల మధ్య నమ్మకాలను నాశనం చేస్తుంది. భావోద్వేగాలను దెబ్బతీస్తుంది. ఒక భాగస్వామి మరొక వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల రెండో వ్యక్తికి చాలా ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతుంది. పరస్పర నమ్మకం అనేది కోల్పోయిన తర్వాత సంసారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అవి కాస్త దారుణాలకు కారణమవుతాయి. అయితే ఈ కేసుల్లో మూడవ వ్యక్తి మీద సివిల్ కేసు వేయడానికి అవకాశం ఉంటుందట. అంతేకాదు పరిహారానికి కూడా డిమాండ్ చేయవచ్చట. ఇటువంటి కేసులను సివిల్ కోర్టులలో విచారించవచ్చట. ఇటువంటి సంబంధాల వల్ల పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ పేర్కొన్నారు.
ఉదాహరణకు 2018లో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎదుటకు జోసెఫ్ షైన్ అనే కేసు వచ్చింది. ఇది వివాహేతర సంబంధానికి సంబంధించిన కేసు. ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానం డీ క్రిమినలైజ్ చేసింది. అయితే ఇది నేరపూరితమైన వ్యవహారం కాదు. దీనిపై ఎటువంటి దీక్షలు ఉండవని సుప్రీంకోర్టు భావించి, నేరాల పరిధి నుంచి తొలగించింది. ఇక ఇటీవల ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మాత్రం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఆ తీర్పు ఆధారంగా ఒక భాగస్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి మీద.. ఆ సంబంధానికి ప్రేరేపించిన మూడో వ్యక్తి మీద సివిల్ చర్యలు తీసుకోవచ్చు. ఈ తీర్పు మనదేశంలో ఏలినేషన్ ఆఫ్ అఫెక్షన్ అనే విధానాన్ని పరీక్షించేందుకు అవకాశం కల్పిస్తుంది..
ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానంలో మరో కేసు కూడా విచారణకు వచ్చింది. 2012లో ఓ మహిళ వివాహం చేసుకుంది. 2021లో తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల.. తమ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించింది. ఆ మహిళ తన భర్తతో చాలా సన్నిహితంగా ఉంటున్నదని.. విహారయాత్రలకు కూడా వెళ్తోందని.. చివరికి ఆమె తన భర్త నుంచి విడిపోయి విడాకులకు దరఖాస్తు చేసిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసిన ఆ మహిళ మీద కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం ఆ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు పై సివిల్ సూట్ కు ఒప్పుకుంది. అయితే అడల్ట్ అనేది తీవ్రమైన నేరం కాకపోయినప్పటికీ.. అది సివిల్ చట్టాలకు లోబడి ఉంటుందని ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.. అయితే మన దేశం లో ఏలియనేషన్ ఆఫ్ అఫెక్షన్ అనే విధానం స్పష్టంగా ఉండకపోయినప్పటికీ.. ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం దీనిని ఒక సివిల్ చర్యగా పరిగణించడం విశేషం. అంతేకాదు సంసారం నాశనం అవ్వడానికి కారణమైన ఆ మూడో వ్యక్తి నుంచి నష్టపరిహారానికి డిమాండ్ చేయవచ్చని ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొనడం గమనార్హం. ఇదే అంగీకారానికి గనక దేశ సర్వోన్నత న్యాయస్థానం వస్తే.. వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారు ఇకపై పద్ధతిగా ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.