https://oktelugu.com/

Crime News : మంచింగ్‌ కోసం దారుణం.. సగం కాలిన శవాన్ని పీక్కుతిన్నారు!!

ఈ రోజే అంత్యక్రియలు చేశారు కాబట్టి అక్కడ కుటుంబ సభ్యులు ఏమైనా పెట్టి ఉంటారని భావించారు. తెచ్చుకునేందుకు కాలుతున్న చితి వద్దకు వెళ్లారు. మంచి నిషాలో ఉన్న వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో సగం కాలిన యువతి శవం మాంసం ముద్దలు కనిపించాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 7, 2023 / 09:47 PM IST
    Follow us on

    Crime News : కాశీలో అఘోరాలు శవాలను తింటారని వింటుంటా.. అక్కడక్కడా చదువుతుంటాం. మనిషి.. మనిషిని తినడం మాట వింటేనే జుగుత్సాకరం అనిపిస్తుంది. ఒళ్లు జలదరిస్తుంది. అసహ్యంగా అనిపిస్తుంది. అయితే అఘోరాలకు అతీత శక్తులు ఉంటాయి కాబట్టి.. ఇలా శవాలను తిన్నా వారికి ఏం కాదని అంటుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మంచింగ్‌ లేదని శ్మశానానికి వెళ్లి సగం కాలిన శవాన్నే పీక్కు తిన్నారు. ఈ దారుణ ఘటన ఒడిశాలో జరిగింది. మత్తు మనిషిని ఎంతలా దిగజారుస్తుంది అనేందుకు ఇదో ఉదాహరణ.

    ఫుల్లుగా తాగి శ్మశానంలోకి..
    ఒడిశాకు చెందిన మోహన్‌సింగ్, నరేంద్రసింగ్‌ ఇటీవల ఓ మద్యం దుకాణంలో ఫుల్లుగా మద్యం తాగారు. రాత్రి షాప్‌ మూసే సమయం కావడంతో మరికొంత మద్యం కొనుగోలు చేసి బయట తాగుదామని వెళ్లారు. మార్గ మధ్యంలో ఓ శ్మశానం కనిపించడంతో అందులో మందు తాగితే ఎవరూ ఏమీ అనరని భావించారు. వెంటనే లోపలికి వెళ్లారు. సమాధుల మధ్య కూర్చుని వెంట తెచ్చుకున్న మద్యం తాగేందుకు సిద్ధపడ్డారు.

    మంచింగ్‌ లేక..
    మద్యం కొన్న ఇద్దరూ మత్తులో మంచింగ్‌ కోసం స్నాక్స్‌ కొనడం మర్చిపోయారు. ఎలాగైనా మద్యం తాగాలి కాబట్టి.. అప్పుడే వారికి శ్మశానంలో దూరంగా చల్లారుతున్న చితి మంటలు కనిపించాయి. ఇంకేముందు.. ఈ రోజే అంత్యక్రియలు చేశారు కాబట్టి అక్కడ కుటుంబ సభ్యులు ఏమైనా పెట్టి ఉంటారని భావించారు. తెచ్చుకునేందుకు కాలుతున్న చితి వద్దకు వెళ్లారు. మంచి నిషాలో ఉన్న వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో సగం కాలిన యువతి శవం మాంసం ముద్దలు కనిపించాయి.

    వాటిని తింటూ మద్యం తాగారు..
    శవం మాంసం ముద్దలను తీసుకుని తాము తెచ్చుకున్న మద్యం దగ్గరకు చేరుకున్నారు. మద్యం తాగుతూ వాటిని లాగించేశారు. ఊహించుకోవడానికే భయంకరంగా, అసహ్యంగా అనిపిస్తున్నా.. వారు మాత్రం నిషాలో తాము ఏం చేస్తున్నారో తెలియకుండా ఇలా మనిషి మాంసాన్నే మంచింగ్‌లా లాగించేశారు.