https://oktelugu.com/

Corona Third Wave: ముంచుకొస్తున్న కరోనా.. సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్

Corona Third Wave:  మాయదారి కరోనా ముంచుకొస్తోంది. తన రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా పేరిట విరుచుకుపడి దేశంలో సెకండ్ వేవ్ లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయి చాలా మంది ఇల్లు వాకిలీ అమ్ముకున్న వారున్నారు. సెకండ్ వేవ్ భయాలు కళ్లముందు కనపడుతున్న వేళ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు బాంబు పేల్చారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన డీహెచ్ దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని.. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2021 / 06:51 PM IST
    Follow us on

    Corona Third Wave:  మాయదారి కరోనా ముంచుకొస్తోంది. తన రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా పేరిట విరుచుకుపడి దేశంలో సెకండ్ వేవ్ లో లక్షల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలు కోల్పోయి చాలా మంది ఇల్లు వాకిలీ అమ్ముకున్న వారున్నారు. సెకండ్ వేవ్ భయాలు కళ్లముందు కనపడుతున్న వేళ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు బాంబు పేల్చారు.

    ఈరోజు మీడియాతో మాట్లాడిన డీహెచ్ దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని.. మన దేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రెండు మూడు రోజులుగా కేసులు పెరిగాయన్నారు. కేసుల పెరుగుదల థర్డ్ వేవ్ కు సంకేతమన్నారు. సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని శ్రీనివాసరావు చెప్పారు.

    ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఒమిక్రాన్ పై ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తున్నట్టు హెచ్చరించింది. ఈ క్రమంలోనే దేశంలో కూడా విస్తరించే ప్రమాదం ఉంది. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

    డెల్టాతో వచ్చిన సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఇప్పటికైనా జనం థర్డ్ వేవ్ రాకముందే తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్లు తీసుకోవడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని జయించవచ్చు. లేదంటే మరోసారి లాక్ డౌన్ తోపాటు కరోనా కాటుకు గురికావాల్సి వస్తుంది.