https://oktelugu.com/

Congress: కాంగి‘రేస్‌’కు బీజేపీ బ్రేకులు.. ఖాతాలన్నీ ఫ్రీజ్‌!

బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 22, 2024 11:21 am

    Congress

    Follow us on

    Congress: భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారత పార్లమెంటు ఎన్నికలంటే ప్రపంచం మొత్తం మనవైపే చూస్తుంది. ఇక ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజలకు ఓ అనే ఆయుధం సంధించే సమయం. అయితే ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండాల్సిన హక్కులు క్రమంగా హరించుకుపోతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వారికే హక్కులు ఉంటున్నాయి. ఇతరుల స్వేచ్ఛను హరిస్తూ.. వారు హక్కులను అనుభవిస్తారు. ఈ తీరుపై అనేక విమర్శలు వస్తున్నా.. అధికారంలో ఉన్నవారి తీరు మారడం లేదు. తాజాగా అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్‌కు నిధులు అందకుండా ఖాతాలు ఫ్రీజ్‌ చేయడమే ఇందుకు ఉదాహరణ.

    ప్రెస్‌మీట్‌లో ఆవేదన..
    బీజేపీ తీరుపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టారు. తమ పార్టీకి ఎంత నష్టం కలిగిస్తోంది. ఎంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం అని వివరించింది. ఐటీ శాఖ తమ పార్టీ ఖాతాలను స్తంభింపజేయడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేకపోతున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మరోవైపు ఖాతాల ఫ్రీజ్‌తో నేతలు ప్రచారం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక చోటు నుంచి మరో చోటకు కూడా వెళ్లలేని పరిస్థితి.

    అభ్యర్థులకు అందని సాయం..
    ఇక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ తరఫున కూడా ఎలాంటి సాయం అందించలేకపతున్నారు హస్తం నేతలు. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా వెల్లడించారు. దేశంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నా.. ప్రతిపక్షాల హక్కులను కాపాడలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ చేయడం కన్నా కుట్ర ఏమీ ఉండదని అన్నారు.

    ఎందుకు ఫ్రీజ్‌ చేశారంటే..
    ఇక కాంగ్రెస్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. మోదీ కావాలనే చేయించారా.. లేక వేరే ఏదైనా కారణం ఉందా అని ఆరా తీస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ సమర్పించడంలో జాప్యం చేసిందనే కారణంతో ఐటీ శాఖ కాంగ్రెస్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. సాధారణంగా ఐటీ రిటర్న్స్‌ జాప్యం అయితే ఫైన్‌ వేస్తారు. కానీ ఖాతాలను స్తంభింపజేయడంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ఒత్తిడితోనే ఐటీశాఖ ఇలా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఫ్రీజ్‌ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్లపై ఒకవైపు దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నా.. మోదీ సర్కార్‌ కాంగ్రెస్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. వ్యవస్థలు అధికార పార్టీకి సామంతులుగా మారుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈడీ, మోడీ అన్న వాదన ఉంది. తాజాగా ఐటీ కూడా మోదీ కనుసన్నల్లో పనిచేస్తుందన్న వాదన బలపడుతోంది.