Cervical Cancer Vaccine: దేశంలో క్యాన్సర్ కేసులు పెరగడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కొనేందకు కేంద్రం వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. దేశంలోని 9–14 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ టీకా ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
7 కోట్ల డోసులు సిద్ధం..
ప్రారంభ దశ కోసం 7 కోట్ల వ్యాక్సిన్ డోసులను సిద్ధం చేశామని కేంద్రం తెలిపింది. గర్భాషయ క్యాన్సర్ నాలుగు అంత్యం సాధారణ క్యాన్సర్లలో నాలుగో స్థానంలో ఉందన్నారు. అందుకే వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇది గర్భాశయ క్యాన్సర్‌తోపాటు మలం ద్వారా, యోని ఓరోఫారింక్స్‌ని ప్రభావింత చేసే ప్రాణాంతకాలను కూడా ఎదుర్కొంటుందని తెలిపారు. జననేంద్రియ మొటిమలకు కారణమయ్యే క్రిముల నుంచి రక్షణ ఇస్తుందన్నారు.
ఐదో వంతు భారత్‌లోనే..
ప్రపంచంలోని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసుల్లో భారత్‌లోనే ఐదోవంతు నమోదవుతున్నాయి. ఇటీవలికాలంలో ఈ క్యాన్సర్ పెరుగుతోంది. 2022లో 14.6 శాతం ఉండగా 2025 నాటికి 15.7కు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో గర్భకోశ క్యాన్సర్‌ను చేర్చాలనే ఉద్దేశంతో కేంద్రం వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఉచితంగా టీకాలు అందించాలని భావిస్తోంది.