Sensodyne: సెన్సోడైన్ టూత్ పేస్ట్ ప్రజలని అలా మోసం చేస్తుందా ? వాళ్ళు చెప్పిన తప్పులు అవే..!

Sensodyne: ప్రముఖ టూత్ పేస్ట్ ఉత్పత్తుల సంస్థ ‘సెన్సోడైన్’కు సెంట్రల్ కన్య్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) గట్టి షాక్ ఇచ్చింది. కొద్దిరోజులుగా టీవీలో ప్రసారం అవుతున్న ప్రకటనలను 7 రోజుల్లోగా వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజలను తమ ప్రకటనలతో తప్పుదారి పట్టించినందుకు కంపెనీపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సోడైన్ సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒక ప్రకటనలో ‘ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులు సిఫార్సు చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్’, ప్రపంచ […]

Written By: NARESH, Updated On : March 23, 2022 6:06 pm
Follow us on

Sensodyne: ప్రముఖ టూత్ పేస్ట్ ఉత్పత్తుల సంస్థ ‘సెన్సోడైన్’కు సెంట్రల్ కన్య్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) గట్టి షాక్ ఇచ్చింది. కొద్దిరోజులుగా టీవీలో ప్రసారం అవుతున్న ప్రకటనలను 7 రోజుల్లోగా వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజలను తమ ప్రకటనలతో తప్పుదారి పట్టించినందుకు కంపెనీపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

సెన్సోడైన్ సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒక ప్రకటనలో ‘ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులు సిఫార్సు చేస్తున్న టూత్ పేస్ట్ సెన్సోడైన్’, ప్రపంచ నంబర్ 1 సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అంటూ పేర్కొంది. దీనిపై కన్స్యూమర్ అథార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దంత వైద్యులతో చేసిన ప్రకటనను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సోడైన్ ఉత్పత్తులు తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నారని..వీటికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ.. భజన చేసుకోవాలన్న స్పీకర్

టీవీలు, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ తో సహా వివిధ సోషల్ మీడియాలో వచ్చిన సెన్సోడైన్ ఉత్పత్తుల ప్రకటనలపై సుమోటోగా చర్యలు తీసుకుంది. ఈ ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిపినట్లు సంస్థ ఎలాంటి వివరాలను తమకు సమర్పించలేదని కన్య్సూమర్ అథార్టీ తెలిపింది.

కేవలం భారతదేశంలోని దంతవైద్యులు సర్వే చేసి రూపొందించిన ప్రకటనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దంతవైద్యులు సిఫార్సు చేస్తున్నట్టు ప్రకటనలో చూపించడం కరెక్ట్ కాదని అథారిటీ పేర్కొంది. ఈ మేరకు ఈ ప్రకటనలను 7 రోజుల్లోగా తొలగించాలని పేర్కొంది.

Also Read: Kodali Nani: చీప్ లిక్కర్ ను కనిపెట్టిన చీప్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు.. కొడాలి నాని ఆన్ ఫైరింగ్