PM Narendra Modi: షాకింగ్: ప్రధాని మోడీ కేవలం రెండు గంటలే నిద్రపోతారా? నిజమేనా?

PM Narendra Modi: మన రాజకీయ నేతలు నిద్ర తక్కువగానే పోతుంటారు. చంద్రబాబు పదిహేడు గంటలు పని చేస్తారని గతంలో టీడీపీ కార్యకర్తలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వారు తక్కువ సమయం నిద్రపోతూ ఎక్కువ సమయం ఆలోచిస్తుంటారని చెబుతుంటారు. మన నేతల్లో ఎక్కువ కాలం పని చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వారు నిద్రాహారాలు లెక్కచేయరు. ప్రజల కోసం పరితపించే క్రమంలో నిరంతరం పని చేయడమే ప్రధాన ద్యేయంగా ముందుకు వెళుతుంటారు. […]

Written By: Srinivas, Updated On : March 23, 2022 10:53 am
Follow us on

PM Narendra Modi: మన రాజకీయ నేతలు నిద్ర తక్కువగానే పోతుంటారు. చంద్రబాబు పదిహేడు గంటలు పని చేస్తారని గతంలో టీడీపీ కార్యకర్తలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వారు తక్కువ సమయం నిద్రపోతూ ఎక్కువ సమయం ఆలోచిస్తుంటారని చెబుతుంటారు. మన నేతల్లో ఎక్కువ కాలం పని చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే వారు నిద్రాహారాలు లెక్కచేయరు. ప్రజల కోసం పరితపించే క్రమంలో నిరంతరం పని చేయడమే ప్రధాన ద్యేయంగా ముందుకు వెళుతుంటారు.

PM Narendra Modi

ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి కూడా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇరవై రెండు గంటలు పని చేస్తారని రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని వెల్లడించడంతో అందరిలో ఆశ్చర్యం వేసింది. రెండు గంటలే నిద్రపోతే ఆరోగ్యానికి భంగం కాదా అని అందరిలో ప్రశ్నలు వస్తున్నాయి.

Also Read:  అత్యంత కాలుష్య రాజధాని ఢిల్లీనేనా?

దేశం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి కూడా సిద్ధమేనని మన నేతలు ప్రకటించడం తెలిసిందే. కానీ ఆచరణలో చూపడం మాత్రం అంత తేలిక కాదు. రోజుకు ఇరవై రెండు గంటలు పని చేయడమంటే మాటలు కాదు. దానికి చాలా సహనం, ఓర్పు, పట్టుదల కావాలి. అకుంఠిత దీక్ష ఉండాలి. దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకు సాగేందుకు ఇలా పని చేయడం అలవాటుగా చేసుకున్నారు. దీంతో మోడీ పనితనం గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం.

PM Narendra Modi

పాటిల్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు అందరిలో చర్చ మొదలైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోడీ రోజుకు మూడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవారని చెప్పేవారు. అది ఇప్పుడు ఇంకా ఓ గంట తగ్గించుకుని రెండు గంటలు మాత్రమే నిద్ర పోతున్నారని తెలుస్తోంది. ప్రధాని దేశం కోసం నిద్ర తగ్గించుకోవడం నిజంగా గర్వకారణమే. ఆ బీజేపీ నేత చెప్పినట్టు నిజంగానే మోడీ కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోతారా? లేక మోడీని పొగిడేందుకు ఆ నేత ఇలా చెప్పారా? అన్నది తేలాల్సి ఉంది. మోదీ ‘రెండు గంటల నిద్ర’ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇది నిజమా కాదా? అని అందరూ ఆరాతీస్తున్నారు.

Also Read:  నిన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’..చరిత్రకు మరో కోణమా లేక మరో వివాదమా?

Tags