మూడో దశతో తస్మాత్ జాగ్రత్త?

కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అందరి చూపు మూడో దశపైనే ఉంది వాస్తవానికి మొదటి దశ పూర్తయినప్పుడు ఎవరు కూడా రెండో దశపై దృష్టి పెట్టలేదు. దీంతో ఫలితం అనుభవించారు. ముంచుకొస్తున్న ముప్పుపై ఎవరికి పట్టింపు లేకపోయింది. ఈ నేపథ్యంలో వైరస్ విజృంభించేసరికి సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మూడో దశ ముప్పుపై అప్రమత్తత పెరిగింది. ప్రభుత్వాలు సైతం చర్యల్ని చేపట్టింది. కొవిడ్ వైరస్ స్ర్పైక్ ప్రొటీన్ ఎప్పటికప్పుడు మార్చుకోవడంతో రకరకాల స్ర్టెయిన్లు పుట్టుకొస్తున్న […]

Written By: Srinivas, Updated On : June 8, 2021 5:59 pm
Follow us on

కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అందరి చూపు మూడో దశపైనే ఉంది వాస్తవానికి మొదటి దశ పూర్తయినప్పుడు ఎవరు కూడా రెండో దశపై దృష్టి పెట్టలేదు. దీంతో ఫలితం అనుభవించారు. ముంచుకొస్తున్న ముప్పుపై ఎవరికి పట్టింపు లేకపోయింది. ఈ నేపథ్యంలో వైరస్ విజృంభించేసరికి సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మూడో దశ ముప్పుపై అప్రమత్తత పెరిగింది. ప్రభుత్వాలు సైతం చర్యల్ని చేపట్టింది.

కొవిడ్ వైరస్ స్ర్పైక్ ప్రొటీన్ ఎప్పటికప్పుడు మార్చుకోవడంతో రకరకాల స్ర్టెయిన్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా మూడో వేవ్ పై వరంగల్ లోని నిట్ అధ్యయనం చేస్తోంది. తీవ్రత ఎలా ఉండనుంది? ఎలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తి గురించి ప్రజలను అప్రమత్తం చేసే పనిలో శాస్ర్తవేత్తలు ఉన్నారు.

మొదటి దశతో పోలిస్తే రెండో దశలో తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడో దశలో మరింత ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్ పలు రూపాంతరాలతో హైబ్రిడ్ వేరియంట్ గా మారే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మూడో దశలో పిల్లల్లో శరీరం మీద దద్దర్లు, కళ్ల కింద మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జలుబు వంటి లక్షణాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు.

వర్సాకాలం కావడంతో పిల్లల్లో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు, డయేరియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. వీలైనంత వరకు పిల్లల్ని బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మూడో దశలో వచ్చే లక్షణాలుగా చెబుతున్న వాటిల్లో ఏ సమస్యె ఎదురైనా తక్షణమే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సలహాలు, సూచనలు పాటించాలి.