Budget 2024 Expectations: కేంద్ర బడ్జెట్ పిభ్రవరి 1న సమర్పించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కొత్త పార్లమెంట్ భవన్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగానికి సంబంధించిన బడ్జెట్ లో ఎలాంటి మార్పులు ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీసారి బడ్జెట్ సాధారణంగానే ఉన్నా ఈసారి మాత్రం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఎందుకంటే 2024 లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టినా.. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు దీనిని హోల్డ్ లో ఉంచుతారు. ఎలాంటి కేటాయింపులు ఇప్పుడే చేయరు. ఈ సందర్భంగా ఈసారి గతంలో కంటే ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
భారతదేశం బ్రిటిష్ పాలనలో కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఇప్పటికీ కొన్ని ఆంగ్లేయుల విధానాలు అనుసరిస్తున్నారు. బ్రిటన్ విధానాలను అనుగుణంగా బడ్జెట్ కూడా గతంలో ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టారు. దశాబ్దాల పాటు ఈ సాంప్రదాయమే కొనసాగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ విధానాన్ని మార్చారు. 2017 సంవత్సరంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి ఉన్న సమయంలో బడ్జెట్ ను ఫిబ్రవరి 28 నుంచి 1వ తేదీకి మార్చారు. ఆంగ్లేయుల విధానాన్ని అనుసరించబోమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
బడ్జెట్ సమయంలోనూ కొన్ని మార్పులు చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఫిబ్రవరి నెల చివరిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా సాయంత్రం 5 గంటల వరకే కొనసాగించారు. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. ఇక్కడి సాయంత్రం 5 గంటలు.. బ్రిటన్ కు ఉదయం 11 గంటలకు సమానంగా ఉంటుంది. అందువల్ల భారతదేశానికి అనుగుణంగా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
ప్రస్తుత బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా చూపడం లేదు. కానీ 2016 వరకు రైల్వే వ్యవస్థకు ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించారు. ఇది కూడా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండేది. దీంతో 2016లో మోడీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ను తీసేని కేంద్ర ప్రభుత్వంలోనే కలిపేశారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీ రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో కలిపేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎవరికి మోదం, ఎవరికి ఖేదం ఉంటుందో చూడాలి.