https://oktelugu.com/

Budget 2024: బియ్యం ధరల కట్టడికి కేంద్రం కొత్త నిర్ణయం.. రేపటి ఆ విధానం నుంచి అమల్లోకి

దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి కళ్లెం వేసేందుకు శుక్రవారం నుంచి భారత్ బ్రాండ్ పేరుతో.. కిలో సన్నాల బియ్యాన్ని 29 రూపాయలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 1, 2024 4:38 pm
    Budget 2024

    Budget 2024

    Follow us on

    Budget 2024: కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి వల్ల దేశంలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా సన్నాల రకాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ ధరలు దిగి రావడం లేదు. దీంతో బియ్యం కొనుగోలు చేసేందుకు సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రధాన ఆహారం బియ్యం కావడంతో డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. అంతేకాదు అది శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

    దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి కళ్లెం వేసేందుకు శుక్రవారం నుంచి భారత్ బ్రాండ్ పేరుతో.. కిలో సన్నాల బియ్యాన్ని 29 రూపాయలకు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రైతు మీద అందించే ఈ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో_ ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( నా_ ఫెడ్) , కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ( ఎన్ సీసీఎఫ్), కేంద్రీయ బండార్ ఔట్ లెట్ల ద్వారా కేంద్రం విక్రయించనుంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరుతోంది. ఫలితంగా ఇది రెవెన్యూ లోటుకు దారితీస్తోంది. ఈ రెవెన్యూ కట్టడి చేయాలని ఉద్దేశంతో కేంద్రం భారత్ బ్రాండ్ రైస్ ను తెరపైకి తీసుకొచ్చింది.

    భారత బ్రాండ్ పేరుతో విక్రయించే బియ్యానికి సంబంధించి కేంద్రం ఏ క్షణమైనా కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం నుంచే భారత్ బ్రాండ్ పేరుతో బియ్యండి వికరించే అవకాశం శుక్రవారం నుంచే భారత్ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోధుమపిండి, పప్పు ధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరుతో తక్కువ ధరలకు విక్రయిస్తోంది. ఇక గత నవంబర్లో తృణ ధాన్యాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతానికి పెరిగింది. అయితే దీన్ని కట్టడి చేసేందుకు.. దేశంలో బియ్యం లభ్యతను పెంచేందుకు కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో విదేశాలకు ఎగుమతులను నిలిపివేసింది. భారత్ రైస్ పేరుతో కొత్త బ్రాండ్ తీసుకొచ్చింది. దీని ద్వారా రాయటం మీద ప్రజలకు బియ్యాన్ని విక్రయించనుంది.. ఈ నిర్ణయాన్ని ఇటీవల తీసుకున్నప్పటికీ.. పార్లమెంట్లో బడ్జెట్ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం. కాగా, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన ప్రభుత్వం.. బాస్మతి బియ్యం ఎగుమతులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు.