Election Commission: తెలంగాణలో సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైంది. ఇక ఆ తరువాత ఏంటి? అని అనుకునే లోపే ఎన్నికల సంఘం అప్పుడే అప్డేట్ ఇచ్చేసింది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని, దాని కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొంది. ఆ తరువాత ఎంపీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా.. ఈ ఏడాది పొడవున ఎన్నికలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో 2023ను ఎలక్షన్ ఇయర్ గా పేర్కొంటున్నారు. ఈ తరుణంలో 18 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల సంఘం అలర్ట్ ప్రకటించిది. వెంటనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఎందుకంటే?
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ విస్తృత ప్రచారం చేస్తోంది. అందుకోసం వివిధ మార్గాలను అందుబాటులో ఉంచుతోంది. ఒకప్పుడు ఓటు నమోదు చేసుకోవాలంటే దరఖాస్తు నింపి కార్యాలయంలో ఇస్తే.. ఎప్పటికో గానీ ఓటరుగా పేరు వచ్చేది కాదు. ఆ తరువాత ఆన్లైన్ ను ప్రవేశపెట్టింది. యువత ఎక్కువగా ఓటు నమోదు చేసుకోవడానికి కొన్ని యాప్ లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కొన్ని ప్రాంతాల్లో పట్టించుకోలేదు. అయితే తాజాగా మరో యాప్ అందుబాటులోకి వచ్చింది.
రాబోయే రోజుల్లో పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే deshkaforum. ఈ యాప్ ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఓటు హక్కు ఉన్న వారు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ లో ఓటు నమోదు చేసుకోవడానికి ఈనెల 9 వరకే అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.