HomeజాతీయంBasavatarakam Hospital : దేశంలోనే నంబర్ 2 బసవతారకం ఆస్పత్రి.. బాలయ్య సాధించిన ప్రగతి

Basavatarakam Hospital : దేశంలోనే నంబర్ 2 బసవతారకం ఆస్పత్రి.. బాలయ్య సాధించిన ప్రగతి

Basavatarakam Hospital : బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఆస్పత్రి నిర్వహణలో భేష్ అని ఔట్ లుక్ మేగజైన్ ప్రశంసించింది. నిరుపేదలకు అతి తక్కువ ధరకే కేన్సర్ వైద్యం అందిస్తున్నారని సమగ్ర కథనం ప్రచురించింది. తెలుగు రాష్ట్రలకు బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి సుపరిచితం. ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని పేదలకు అతి తక్కువ ధరకు అందించే ఆరోగ్య ప్రదాయిని. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా పేద బాధితులు ఉంటే వైద్యులు సిఫారసు చేసేది ఈ ఆస్పత్రినే. కనీస చార్జీలతో అత్యుత్తమ సేవలందించడం ఈ ఆస్పత్రి స్పెషల్. నిర్వహణలోనూ ముందుంటుంది. అందుకే దేశంలో రెండో స్థానంలో నిలిచింది.

ఈ ఆస్పత్రి నిర్వహణపై చైర్మన్ నందమూరి బాలక్రిష్ణ ప్రత్యేకంగా ఫోకస్ పెడతారు. ఎక్కడా హంగూ ఆర్భాటాలకు పోరు. ఆస్పత్రి లో మెరుగైన వైద్య సౌకర్యల కోసం బాలకృష్ణ నిరంతరం తపన పడుతూంటారు. పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు సమయం కేటాయిస్తూ ఉంటారు. ఎక్కడా చిన్న సమస్య రాకుండా చూసుకుంటూ ఉంటారు.  సినిమాలతో పాటు రాజకీయ రంగంలో బిజీగా ఉన్నా.. ఆస్పత్రి నిర్వహణకు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు.చిన్న అవినీతి ఆరోపణ లేకుండా సక్సెస్ ఫుల్ గా రన్ కావడం వెనుక బాలక్రిష్ణ కృషి ఉంది.

ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ ఔట్ లుక్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం అందించే ఆస్పత్రులలో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి మొదటి స్థానంలో… నిలవగా రెండో స్థానంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిలిచింది.  క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహణలో చైర్మన్ బాలక్రిష్ణ  తీరు ఔట్ లుక్ పత్రిక ప్రశంసించింది. నిరుపేదలకు అతి తక్కువ ధరకే అద్భుతమైన క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారని కొనియాడింది.బసవతారకం ఆస్పత్రి సాధించిన ఘనతపై.. చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version