https://oktelugu.com/

Ram Mandir: బీజేపీ.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట.. రానంటున్న కాంగ్రెస్‌పై సెటైర్లు!

రతీయుల 500 ఏళ్ల కల సాకారం కాబోతున్న వేళ.. చాలా మంది తమకు ఆ వేడుకను స్వయంగా చూసే భాగ్యం లేదని కోట్లాది మంది బాధపడుతున్నారు. అయినా ఈ మహత్తర కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 21, 2024 / 12:30 PM IST

    Ram Mandir

    Follow us on

    Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు వేళయింది. మరో 24 గంటల్లో బాల రాముడు మందిరంలో కొలువుదీరబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆహ్వానాలు అందుకున్న భక్తులు, కరసేవకులు, సాధువులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రామ్‌ లల్లా ప్రణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ శ్రీరాముడితో అనుబంధం ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఆదివారం రాత్రి అయోధ్యకు చేరుకునే అవకాశం ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈ మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రకటించింది. అన్ని రాజకీయా పార్టీలకు ఆహ్వానం పంపించింది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని ప్రకటించింది. పార్టీ కార్యక్రమంలా నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అందుకే తాము ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

    కాంగ్రెస్‌ ప్రకటనపై నెట్టింట్లో సెటైర్లు..
    భారతీయుల 500 ఏళ్ల కల సాకారం కాబోతున్న వేళ.. చాలా మంది తమకు ఆ వేడుకను స్వయంగా చూసే భాగ్యం లేదని కోట్లాది మంది బాధపడుతున్నారు. అయినా ఈ మహత్తర కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆలయాలు, మైదానాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆహ్వానం అందిన కాంగ్రెస్‌ మాత్రం వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు అయితే ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. రామ మందిరం కూల్చిన బాబర్‌ సమాధిని చూసేందుకు నాడు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాహుల్‌ గాంధీలు వెళ్లారని, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రామంటున్నారని విమర్శిస్తున్నారు.

    బీ.జే.పీ అంటే..
    ఇక బీజేపీ నాయకులు పార్టీల పేరును కూడా రామాలయానికి పారీ పేరును ఆపాదించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసుకుంటున్నారు. బీ అంటే బాయీస్‌(22) అని, జే అటే జనవరి అని, పీ అంటే ప్రాణ ప్రతిష్టగా చెప్పుకుంటున్నారు. మొత్తగా బీయీస్‌ జనవరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. బీజేపీ కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటున్నారు.

    ఐ.ఎన్‌.సీ అంటే..
    ఇక అదే బీజేపీ నాయకులు ఐఎన్‌సీ(ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌)ను కూడా రామాలయ ప్రారంభోత్సవానికి వ్యతిరేక పార్టీగా ఆపాదిస్తున్నారు. దీనికి ఐఎన్‌సీ అబ్రివేషన్‌ను ఆపాదిస్తున్నారు. ఐ అంటే.. ఐ యామ్‌ అని, ఎన్‌ అంటే నాట్‌ అని, సీ అంటే కమింగ్‌ అని పేర్కొంటున్నారు. ఐఎన్‌సీ అంటే ఐయామ్‌ నాట్‌ కమింగ్‌ గా పేర్కొంటున్నారు.

    ఇలా అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ను ఒకవైపు రామ భక్తులు, మరోవైపు బీజేపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు.