Ayodhya Temple: సాక్షాత్తు ఆ శ్రీరాముడు నడయాడిన నేల.. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. ఈమేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రామమందిరం తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి సుమారు 4 వేల మంది ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆహ్వాన పత్రాలు పంపించారు. మొదటి రోజు ప్రజలెవరికీ అనుమతి లేదని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అతిథులకు పంపిన ఆహ్వాన పత్రాన్ని రామమందిరం తీర్థక్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. అద్భుతంగా ఉన్న ఈ కార్డును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
అతిథులకు మాత్రమే..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి జనవరి 22న అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపించారు. ఈ ఆహ్వాన పత్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహంత్ నృత్య గోపాలదాస్. ఆహ్వాన పత్రంలో బాల రాముడి చిత్రం ముద్రించారు. ఆహ్వానపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఒక్కసారి మాత్రమే లోపలికి వచ్చేలా దీనిని ఏర్పాటు చేశారు. అతిథి వేదిక నుంచి వెళ్లిన తర్వాత మళ్లీ లోపలికి వచ్చే అవకాశం ఉండదు.
విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభం..
మరోవైపు ఆలయ ప్రారంభోత్సవం తర్వాత అయోధ్యకు వచ్చే అతిథుల కోసం అయోధ్యలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. డిసెంబర్ 30న అయోధ్య రైల్వేస్టేషన్, శ్రీరామ్ ఎయిర్ పోర్టును కూడా ప్రారంభించారు. అయోధ్యలో భక్తులు దిగగానే అణువనువునా భక్తిభావం, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రామాయణ ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు, పెయింటింగ్స్, విగ్రహాలు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు గోడలపై అందమైన సీతారాముల చిత్రపటాలు ఏర్పాటు చేశారు.
View this post on Instagram