HomeజాతీయంAyodhya Mosque: తాజ్ మహల్ ను మించి అయోధ్య మసీదు.. విశేషాలివీ

Ayodhya Mosque: తాజ్ మహల్ ను మించి అయోధ్య మసీదు.. విశేషాలివీ

Ayodhya Mosque: అయోధ్యలో రామ మందిర నిర్మాణం చురుగ్గా సాగుతోంది. జనవరి 22న నూతనంగా నిర్మిస్తున్న మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసేందుకు నిర్వహణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట లో పాల్గొననున్నారు. ఇదంతా ఒకఎత్తయితే అయోధ్యలో మసీదు నిర్మాణం కూడా జరగబోతోంది. అది కూడా తాజ్ మహల్ కంటే మెరుగ్గా మసీదును నిర్మించబోతున్నారు.. ఫిబ్రవరి 2020లో అయోధ్య నడిబొడ్డున ఉన్న ధన్నిపూర్ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఈ మసీదు నిర్మాణం కోసం కేటాయించారు.. 2019 నవంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దారి తీసిన నేపథ్యంలో.. కొంత మంది ముస్లింలు 2020లో మసీదు నిర్మించాలని.. అది కూడా అయోధ్యలోనే నిర్మించాలని భావించారు.16వ శతాబ్దంలో నిర్మించిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ లో కూల్చి వేసిన సంగతి తెలిసిందే.. అప్పటినుంచి ఆ మసీదుకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

అయోధ్యలో మసీదు నిర్మాణాన్ని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. డబ్బు, పరిపాలన జాప్యాల కారణంగా ఇప్పటివరకు ఈ మసీదు నిర్మాణంలో అడుగులు ముందుకు పడలేదు.. ఇక ఈ మసీదు అభివృద్ధి కమిటీకి మహారాష్ట్ర కు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు హాజీ అర్ఫత్ నంబర్ 2023లో కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు.. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే సన్నిధిలో సేకరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.. ఈ మసీదు నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా కమిటీ సభ్యులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ ఫ్యాకల్టీ వ్యవస్థాపక డీన్ ఎస్ఎం అక్తర్ మసీదు నిర్మాణానికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించారు. 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆస్పత్రి, కమ్యూనిటీ కిచెన్, లైబ్రరీ, పరిశోధన కేంద్రాన్ని ఆయన పొందుపరిచారు. అయితే ఇప్పుడు తాజ్ మహల్ కంటే మెరుగైన, భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకదానిగా దీనిని రూపొందించడమే లక్ష్యమని అంటున్నారు. “సుమారు 21 అడుగుల పొడవున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్” లాగా ఈ మసీదును నిర్మిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.. మునుపటి నమూనా కోడిగుడ్డు నిర్మాణం లాగా ఉంది.. అది ఒక మసీదు ఆకృతిలో కూడా లేదు అని ఆయన వివరించారు.. జీరో_ కార్బన్, ఫుట్ ప్రింట్ డిజైన్ గురించి, నీకు చెందిన ఆర్కిటెక్ట్ ఇమ్రాన్ షేక్ తయారుచేసిన కొత్త డిజైన్ సిద్ధంగా ఉందని, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి ఆస్పత్రి, కమ్యూనిటీ కిచెన్ అలాగే ఉంచి.. మసీదు నిర్మాణ ప్రణాళికలో ఇతర అంశాలను ప్రవేశపెడతామని
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ ఫ్యాకల్టీ వ్యవస్థాపక డీన్ ఎస్ఎం అక్తర్ చెబుతున్నారు.

భారతదేశంలో ప్రతి మసీదు నాలుగు మినార్లతో కూడి ఉంది. అయోధ్యలో నిర్మించే మసీదులో ఐదు మినార్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అయోధ్య లో నిర్మించే రామాలయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరయు నది ఘాట్ వద్ద ప్రతిరోజు సాయంత్రం రామాయణం ఇతి వృత్తాన్ని వివరించే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అదే తీరుగా అయోధ్యలో నిర్మించే మసీదు లోపల అజాన్(ప్రార్థన) ను విభిన్న రీతులలో వినిపిస్తామని మసీదు నిర్మాణ కమిటీ చెబుతోంది. మసీదు నిర్మాణంలో వినియోగించే దీపాలు సౌర శక్తితో పనిచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అవి సూర్యోదయం సమయంలో నిలిచిపోతాయి. సూర్యాస్తమయంలో వెలుగుతాయి. ఈ మసీదు సందర్శించే యువత కోసం దుబాయ్ కంటే పెద్ద ఫిష్ అక్వేరియం కూడా ఏర్పాటు చేస్తామని నిర్మాణ కమిటీ చెబుతోంది. రంజాన్ తర్వాత మసీదు నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభమవుతాయని కమిటీ బాధ్యులు పేర్కొంటున్నారు. ఖురాన్ శ్లోకాలతో చెక్కిన ఒక ఇటుక సౌదీ అరేబియాలోని మదీనా, భారతదేశంలోని ప్రముఖ దర్గాల వద్దకు పంపిస్తామని.. దానిని మసీదు నిర్మాణంలో వాడతామని నిర్మాణ కమిటీ బాధ్యులు చెబుతున్నారు. మసీదు నిర్మాణానికి ముందు ప్రత్యేక పాటలను రికార్డు చేస్తున్నారు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ విజయ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో వీటిని రూపొందిస్తున్నారు.. ఇందులో వీడియోలు కూడా ఉన్నాయని సమాచారం. అయితే అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో రామ మందిరం నిర్మాణ కమిటీ కూడా ఇలాంటి ఒక చిత్రాన్ని రూపొందించాలని యోచిస్తోంది. ఇక ఈ మసీదుకు మస్జీద్ _ ఎ_ అయోధ్య అని పేరు పెట్టాలని అనుకున్నారు. కొంతమంది దానిని వ్యతిరేకించారు. దీంతో దానిని మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదుగా మార్చారు. అయోధ్య లో నిర్మించే మసీదు నిర్మాణం కోసం ఐఐఎఫ్సీ విరాళాల కోసం ఇంటింటికి వెళ్లదని, ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో సులభంగా విరాళం ఇచ్చేందుకు క్యూ ఆర్ కోడ్ లతో వెబ్ సైట్ ప్రారంభిస్తామని నిర్మాణ కమిటీ చెబుతోంది.. అంతేకాదు రామ మందిరం చూడడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మసీద్ సందర్శించే విధంగా తాము ప్రచారం చేస్తామని నిర్మాణ కమిటీ బాధ్యులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version