Nagarjuna: ఈ సంక్రాంతి కి హిట్ కొట్టలేకపోయిన నాగార్జున… కారణం ఏంటంటే..?

నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమా కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందింది అయితే ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా నాగార్జున మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Written By: Gopi, Updated On : January 16, 2024 10:36 am

Nagarjuna

Follow us on

Nagarjuna: సంక్రాంతి వచ్చిందంటే సినిమాల పండుగ మొదలవుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతి సంక్రాంతి సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రతి హీరో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు.

ఇక ఇప్పుడు కూడా చాలా సినిమాలు ఈ సంక్రాంతి బరిలో నిలవడానికి ఆసక్తిని చూపించినప్పటికి అందులో కొన్ని సినిమాలను వేరే డేట్ కి వచ్చేలా ప్రొడ్యూసర్లు అందరూ మీటింగ్ ని కండక్ట్ చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు అందులో ముఖ్యంగా రవితేజ హీరోగా వస్తున్న ఈగల్ సినిమాని సంక్రాంతి భారీ నుంచి తప్పించి ఫిబ్రవరి 9వ తేదీకి పోస్ట్ పోన్ చేసుకునేలా చేశారు. ఇక దాంతో ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. అందులో హనుమాన్ సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది…

ఇక ఇదిలా ఉంటే నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ సినిమా కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందింది అయితే ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా నాగార్జున మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదనే టాక్ అయితే వస్తుంది. ఇక ఇంతకుముందు నాగార్జున సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకున్నాడు.

ఇక ఇప్పుడు కూడా అదే పంథాలో సినిమా చేసి కమర్షియల్ సక్సెస్ కొట్టాలని చూసినప్పటికీ అది మాత్రం ఇప్పుడు వర్కౌట్ కాలేదు. కారణం ఏంటి అంటే ఈ సినిమా రొటీన్ రొట్టె ఫార్ములా సినిమా కావడమే దానికి పెద్ద మైనస్ గా మారింది అంటూ ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక ఇలాంటి సినిమాలకి కాలం చెల్లింది. అనడానికి ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో వరుసగా నాగార్జునకు ఫ్లాప్ సినిమాలు రావడం కూడా మరొక మైనస్ గా మారింది ఇక ఇప్పుడు ఈ సినిమాతో కూడా సక్సెస్ కొట్టలేకపోయిన నాగార్జున తన కెరీర్ ని పూర్తిగా డౌన్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది…