Telugu Kannada Languages: తెలుగు, కన్నడ, తమిళం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వాడుకలో ఉన్న భాషలు. పక్క పక్క ప్రాంతాలైన ఎవరి ప్రాంతీయాభిమానం వారిది. ఇవన్నీ ఒకే జాతి నుంచి పుట్టుకొచ్చినట్లు చరిత్ర చెబుతున్నది. వీటన్నింటికి మూలం ద్రవిడం. వీటి గురించి కూలంకషంగా ”ద ద్రవిడియన్ లాంగ్వేజెస్” అనే పుస్తకంలో భద్రిరాజు కృష్ణమూర్తి సవివరింగా వివరించారు. సమయం దొరికినప్పుడు ఈ పుస్తకాన్ని తిరిగేస్తే భాష పుట్టుపుర్వోత్తరాల గురించి తెలుసుకోవచ్చు. తెలుగు, కన్నడ భాషల మూలం ఒకటే అవడం వల్ల లిపి నిర్మాణం, పలకడంలో సారుప్యత ఉంటుంది.
ద్రవిడం అన్ని భాషలకు మూలం..
క్రీస్తు పూర్వమే ద్రవిడ భాష వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు, మధ్య భారత దేశం, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో ద్రవిడ భాషను మాట్లాడేవారంటే ఆశ్చర్యకం కలగకమానదు. దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందినవి ఉన్నట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. 14వ శతాబ్దపు సంస్కృత గ్రంథం లీలాతిలకం, మణిప్రవాళం వ్యాకరణంలో ప్రస్తుత కేరళ, తమిళనాడులలో మాట్లాడే భాషలు ఒకేలా ఉన్నాయి. ఇలా చరిత్రను తిరిగేస్తే ఇక్కడ చోటు చాలకపోవచ్చు.
పోలికలు
ఇక, తెలుగు, కన్నడ భాషల విషయాన్నికొస్తే తెలుగు కంటే ముందు కన్నడ లిపి భాషగా ఉంది. శాతవాహనులు కదంబ లిపిని ఉపయోగించేవారు. 5వ, 7వ శతాబ్దాలలో ప్రారంభ కదంబ లిపిని శాసనాలలో చూడవచ్చు. కన్నడలో సాహిత్య రచనలు 9వ శతాబ్దంలో విస్తరించడం ఆరంభమయ్యాయి. వీటిని తెలుగులో తరువాత అనువదించారు. తెలుగు, కన్నడ అక్షరమాలలో పోలికలు కూడా దాదాపుగా ఒకేలా ఉండటం గమనించదగ్గ విషయం.
తెలుగు, కన్నడ పోలికలు కొన్ని…
అ/అ ఆ/ఆ
ఇ/ఇ ఈ/ఈ
ఉ/ఉ ఊ/ఊ
ఋ/ఋ ೠ/ౠ
ಌ/ఌ ೡ/ౡ
ఎ/ఎ ఏ/ఏ
ఓ/ఓ ఓ/ఓ
ఐ/ఐ ఔ/ఔ
అచ్చు యంత్రం వచ్చిన తరువాత..
అచ్చు యంత్రం వచ్చిన తరువాత కన్నడ, తెలుగు లిపిల్లో బాగా మార్పు వచ్చింది. తెలుగులో అక్షరాల మీద ‘‘అడ్డగీత’’ ఉండేది. పదాలను దీర్ఘంగా పలకడానికి వాటిని వాడేవారు. కాలక్రమంలో వ్యవహారిక భాషా పండితులు రావడం, అచ్చులను ముద్రించేందుకు సరళీకృతం చేయడం జరిగింది. వంకర టింకరలుగా ఉండే అక్షరాలను గుండ్రంగా మారాయి. కాగా, కన్నడలో అక్షరాలపై అడ్డగీతలు మారలేదు. కన్నడ లిపి కోణాకారంలో ఉండటమే కాక, వంకర టింకరలు అలానే ఉన్నాయి. ఇక విరామ చిహ్నాల(I) విషయంలోను మార్పులు వచ్చాయి. వీటిని వాక్యం చివరిలో ఫులిస్టాప్ గా, కామగా సూచించడానికి వాడేవారు. వాక్యం పూర్తయ్యింది అని తెలపడానికి (II) రెండు విరామ చిహ్నాలను ఉపయోగించేవారు. కాలక్రమంలో ఫుల్ స్టాప్(.), కామ(,)గా సూచించడం మొదలుపెట్టారు. కన్నడలో గ్రాంధిక రాతలు అలానే ఉన్నాయి. అలాగే, తెలుగు, కన్నడలో ‘‘ప’’ను ఒకే రకంగా పలికేవారు. అయితే, కన్నడలో ప్రస్తుతం ‘‘ప’’ను ‘‘హ’’గా పలిస్తున్నారు.