https://oktelugu.com/

Allu Arjun: హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని ‘ఛీ’ కొట్టిన అల్లు అర్జున్.. ఒక సినిమా జాతకమే మార్చేసిందిగా!

నందమూరి కళ్యాణ్ రామ్ 'అతనొక్కడే' సినిమా ద్వారా ఇతనిని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో సురేందర్ రెడ్డి కి ఎన్టీఆర్ , మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 15, 2023 / 03:05 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: ఇండస్ట్రీ లో ఎంత పెద్ద స్టార్ హీరో కి అయినా, ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ కి అయినా సక్సెస్ ఉంటేనే విలువ అని అందరూ అంటూ ఉంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజం అని రీసెంట్ గా జరిగిన ఒక ఉదాహరణ చూస్తే అర్థం అవుతుంది.టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి కి మంచి పేరున్న సంగతి అందరికీ తెలిసిందే.

    నందమూరి కళ్యాణ్ రామ్ ‘అతనొక్కడే’ సినిమా ద్వారా ఇతనిని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో సురేందర్ రెడ్డి కి ఎన్టీఆర్ , మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. దురదృష్టం కొద్దీ అవి కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ సినిమాలు అయ్యాయి కానీ, సురేందర్ రెడ్డి టేకింగ్ కి మాత్రం మంచి పేరు వచ్చింది.

    ఆ తర్వాత సురేందర్ రెడ్డి కి రవితేజ తో ‘కిక్’ మరియు అల్లు అర్జున్ తో ‘రేసు గుర్రం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ‘రేసు గుర్రం’ చిత్రం అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్ లో మాత్రమే కాదు, ఇండస్ట్రీ లోనే ఆల్ టైం టాప్ 4 చిత్రం గా నిల్చింది.ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయ్యిందని రీసెంట్ గా ఒక టాక్ వచ్చింది.

    అయితే సురేందర్ రెడ్డి లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో అల్లు అర్జున్ ఇప్పుడు సురేందర్ ప్రాజెక్ట్ ని క్యారిల్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.’పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఆయన కెరీర్ పరంగా ఎలాంటి రిస్క్ చెయ్యదల్చుకోలేదని అర్థం అవుతుంది.