Ajit Doval Secret Operation: దుమ్ము పట్టిన జుట్టు.. నల్లటి చర్మం.. చిరిగిన శాలువా.. అతుకులతో కూడిన దుస్తులు.. తెగిన చెప్పులు.. చేతి కర్ర సహాయం నాణేలు ఏరుకుంటూ అతడు వీధుల వెంట తిరుగుతున్నాడు. అతడిని చూసి తోటి వాళ్లు పిచ్చోడనుకున్నారు. తమకు తోచినంత ఆహారమో..నీరో ఇవ్వడం మొదలుపెట్టారు. అతడు అలా వీధుల వెంట కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్ళాడు. చివరికి తను అనుకున్నది సాధించాడు.. అదేంటి ఓ పిచ్చోడు.. అందులోను బిచ్చగాడు అనుకోవడమేంటి.. అనుకున్నది సాధించడం ఏంటి.. అసలు అతడికి ఉన్న లక్ష్యం ఏంటి.. ఈ ప్రశ్నలన్నీ మీ మదిలో మెదులుతున్నాయి కదా.. ఆ ప్రశ్నలకు సమాధానాల పరంపరే ఈ కథనం. ఈ కథనం రొటీన్ గా ఉండదు. ప్రతి వాక్యం కూడా రోమాలు నిక్కబడితే అలా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అడ్వెంచర్ సినిమాను 70mm స్క్రీన్ లో డాల్బీ సౌండ్ లో కళ్ళ ముందు ఉంచుతుంది. అది మా గ్యారెంటీ.
Also Read: పెళ్లై, కూతురున్నా ప్రియుడితో వెళ్లింది.. చివరకు ఇలా అయ్యింది
ఒక్కడి ఆలోచన మొత్తం మార్చేసింది
అది పాకిస్తాన్.. 1980 కాలం.. ఇప్పట్లో మాదిరిగా పాకిస్తాన్ అప్పుడు ప్రతి దానికి దేబిరించడం లేదు. అప్పట్లో పాకిస్తాన్ సైన్యం ఇప్పటి మాదిరిగా ప్రభుత్వం మీద పెత్తనం సాగించడం లేదు. పైగా ప్రతిదానికి భారతదేశంతో కాలుదబడాన్ని పాకిస్తాన్ పరిపాటిగా మార్చుకుంది. అంతేకాదు మనదేశంలో నిత్యం కలహాలు సృష్టించడానికి శత్రు దేశాలతో చేయి కలిపింది. దానికి తగ్గట్టుగానే అడుగులు వేయడం మొదలుపెట్టింది. అప్పట్లో మీడియా వ్యాప్తి ఇంతగా లేదు. పైగా పాకిస్తాన్ ప్రతి విషయాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త వహించేది. అప్పట్లో సరిహద్దుల వద్ద నిత్యం రావణ కష్టం రగులుతూ ఉండేది. రక్తపాతం, కాల్పులు నిత్య కృత్యం లాగా సాగుతూ ఉండేవి. ఇవి ఇలా జరుగుతుండగానే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోందని.. న్యూక్లియర్ బాంబులను రూపొందిస్తున్నదని.. చైనా సహకారం అందిస్తోందని భారత్ కు సమాచారం అందింది. అయితే ఈ సమాచారాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచాలంటే దానికి తగ్గట్టుగా ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలను పాకిస్తాన్ ఇవ్వదు. చైనా బయటకి చెప్పదు.. మరి పాకిస్తాన్ పన్నా గాని బయట దేశాలకు ఎలా చెప్పాలి? ప్రపంచ వేదిక మీద పాకిస్తాన్ దేశాన్ని దోషిలాగా ఎలా నిలబెట్టాలి? ఈ ప్రశ్నలు అప్పటి ఇంటలిజెన్స్ బ్యూరోను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నేను చెబుతాను అంటూ చెయ్యి పైకి లేపాడు ఓ వ్యక్తి. అతని పేరు అజిత్ దోవల్. అప్పటికి అతడు చాలా యంగ్. పైగా సూపర్ కాప్ అని పేరు తెచ్చుకున్నాడు.. అజిత్ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచిన ఇంటెలిజెన్స్ బ్యూరో అతడికి అవకాశం ఇచ్చింది. పైగా ఈ ఆపరేషన్ కు సిక్కిం అని పేరు పెట్టింది..
పాకిస్తాన్లో అడుగుపెట్టాడు
ఇంటెలిజెన్స్ బ్యూరో ఆదేశాల ప్రకారం అజిత్ మారువేషంలో ఒక రకంగా చెప్పాలంటే బిచ్చగాడిగా పాకిస్తాన్ లో అడుగు పెట్టాడు. అతడి లక్ష్యం పాకిస్తాన్ రహస్యంగా దాస్తున్న న్యూక్లియర్ ఆపరేషన్ విషయాలను బయట పెట్టడం.. రహస్యంగా చేస్తున్న ప్రయోగాలను తెలుసుకోవడం.. అప్పట్లో చైనా మద్దతుతో పాకిస్తాన్ న్యూక్లియర్ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ కార్యకలాపాలను ఇస్లామాబాదులోని కహుట లోని ఖాన్ లాబరేటరీస్ లో చేపడుతోంది. అయితే ఈ ప్రాంతం మొత్తం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంది. దీంట్లోకి ఈగ కాదు కదా కనీసం గాలి కూడా వెళ్లే అవకాశం లేకుండా భద్రత ఉంది.. ఎలాగైనా సరే అక్కడ ఉన్న రహస్యాలను బయట పెట్టడానికి అజిత్ కదిలాడు. నెలల తరబడి పాకిస్తాన్ వీధుల్లో ముఖ్యంగా ఇస్లామాబాద్ నగరంలో పిచ్చివాడిలాగా తిరిగాడు. ఎండకు మాడిపోయాడు. వానకు తడిచిపోయాడు. చలికి వణికిపోయాడు. అతడి నరనరంలో దేశమంటే ప్రేమ.. దేశానికి ఏదైనా చేయాలనే కోరిక.. అవన్నీ కూడా అతడిని ముందుకు నడిపించాయి.
ఆ ఆధారం అతడికి లభించింది
ఖాన్ లేబరేటరీ లో పనిచేసే శాస్త్రవేత్తలు ఇస్లామాబాద్ లోని ఒక క్షవరశాలలో క్షవరం చేయించుకునేవారు. అయితే ఆ వెంట్రుకలను క్షవరం చేసిన వ్యక్తి నిర్లక్ష్యంగా వదిలేసేవాడు. అయితే అజిత్ వాటిని అత్యంత జాగ్రత్తగా సేకరించి.. భారతదేశానికి పంపించాడు. ఆ వెంట్రుకలను మనదేశంలోని లాబరేటరీలలో పరిశీలించగా అందులో యురేనియం, రేడియేషన్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో భారత్ భయపడిందే జరిగింది. భారత్ అనుమానిస్తున్నదే నిజమైంది. ఎందుకంటే అక్కడికి ఖాన్ లేబరేటరీస్ లో న్యూక్లియర్ పరీక్షలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులను రూపొందిస్తోంది.. ఈ విషయం అజిత్ దోవల్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలిసింది.
స్వల్ప కాలికం కాదు
ఈ మిషన్ స్వల్పకాలికం కాదు. సుమారు ఆరు సంవత్సరాలు పాటు జరిగింది. ఆరు సంవత్సరాల కాలంలో అజిత్ పాకిస్థాన్లో ఉన్నారు. అడుగడుగునా ముప్పును ఎదుర్కొన్నారు. తను దొరికిపోతే మన దేశ జాతీయ భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. అందువల్లే తనను తాను కాపాడుకుంటూ.. తన ఉనికి తెలియకుండా జాగ్రత్త పడుతూ అజిత్ అడుగులు వేశారు. బార్డర్లో సైనికుడికి మించి ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ దుర్మార్గాన్ని బయటకి తెలిసేలా చేశారు.. అజిత్ చేసిన పని వల్ల పాకిస్తాన్ అను పరీక్ష సామర్ధ్యాలు దాదాపు 15 సంవత్సరాల పాటు ఆగిపోయాయి. ఎందుకంటే ఈ ఆధారాలతో భారత్ ప్రపంచ వేదిక ముందు పాకిస్తాన్ దుర్మార్గాన్ని బయటపెట్టింది. చైనా అనుసరిస్తున్న కుటిల యత్నాన్ని కూడా తెలిసేలా చేసింది. అజిత్ చేపట్టిన ఈ మిషన్ లో ఆద్యంతం క్రైమ్ సినిమాకు మించిన ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాలను దేవదత్ అనే రచయిత అజిత్ దోవల్ ఆన్ ఏ మిషన్ లో పేర్కొన్నారు.