భారతదేశంలోని ప్రాచీన శిల్పకళా నైపుణ్యాన్ని చాటిచెప్పే ఆనవాళ్లు.. ఆలయాలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే.. వాటిని మించిన అద్భుతమైన ఆలయం ఒకటుంది. ఏకంగా పెద్ద కొండనే తొలిచి, ఈ మందిరాన్ని నిర్మించారు! మహారాష్ట్రంలోని ఈ ఆలయ విశేషాలు తరచి చూస్తే.. ఎన్నెన్నో వింతలు, విశేషాలు కనిపిస్తాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం…
ఇది ఒక శివాలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పరిధిలోని పెరూల్ ప్రాంతంలో నిర్మించబడింది. ఎంతో పురాతనమైన ఈ శివాలయం.. ఈ ఏకశిలపై నిర్మించారు. కైలాస మందిరంగా పిలిచే ఈ ఆలయం.. ఔరంగా బాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Also Read: శివరాత్రి పూజ చేస్తున్నారా.. పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలివే..?
ఈ ఆలయం పై భాగంలో సాక్షాత్తూ కైలాసంలో శివుడు ఏ విధంగా కొలువై ఉంటాడో.. ఆ విధంగా ఉంటుంది నిర్మాణం. అంతేకాకుండా.. కైలాసంలో శివుడి కొలువై ఉన్న ప్రాంతం మాదిరిగా.. మంచుతో కప్పినట్టుగా ఉండేలా తెలుగుపు రంగుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే.. కాల క్రమంలో ఆ తెలుపు రంగు వెలిసిపోయింది.
ఇక, దీని నిర్మాణ విశిష్టతను తెలుసుకుంటే అబ్బుర పడాల్సిందే. ఓ పెద్ద కొండను తొలుస్తూ ఈ నిర్మాణం చేపట్టారు. ఇలాంటి నిర్మాణాలు ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ.. అన్ని ఆలయాలనూ కింద నుంచి చెక్కుతూ కొండ పైకి చేరుకొని శిఖరాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని మాత్రం పై నుంచి కిందకు తొలుస్తూ రావడం విశేషం.
Also Read: హనుమంతుడికి తులసి మాల సమర్పిస్తే..?
గుహ మధ్యలో ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ మొత్తం ఆలయాన్ని లాంగ్ వ్యూలో చూస్తే.. రథం ఆకారంలో కనిపించడం విశేషం. ఆలయ గోపురంతోపాటు ఏక శిలలపై చెక్కిన ఏనుగులు, ఇతర జంతువుల విగ్రహాలు అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం కింద పెద్ద నగరం కూడా ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం.
ఇక, కొండను తొలిచిన నిర్మాణంలో.. ఎక్కడా నీళ్లు నిలవకుండా చేసిన ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం నిర్మాణ సమయంలో 20 వేల నుంచి 30 వేల టన్నుల రాళ్లు సేకరించారట. కానీ.. అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు. ఎవరు తీసుకెళ్లారు? అనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ ఆలయాన్నిచూసిన విదేశీయులు.. ఇలాంటి నిర్మాణం ఎలా చేయగలిగారని ఆశ్చర్యం వ్యక్తంచేస్తూనే ఉంటారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఇంత గొప్ప ఆలయ నిర్మాణాన్ని క్రీ.శ. 757లో రాష్ట్ర కూటరాజైన మొదటి నరేష్ కృష్ణ హయాంలో మొదలు పెట్టారు. దీని నిర్మాణానికి ఒకటీరెండు కాదు.. ఏకంగా 150 ఏళ్లు పూర్తయ్యిందంటే ఎంత గొప్ప నిర్మాణమో అర్థం చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా 1983లో గుర్తించింది యునెస్కో. కాగా.. ఈ ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, దౌలతా రాజు హసన్ గంగూ భామణి తరచూ సందర్శించేవారని చరిత్రకారులు చెబుతున్నారు.