మొన్నటివరకు కరోనా వైరస్‌తో ఇబ్బందులు పడి.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో.. మరోసారి కొత్త స్ట్రెయిన్ ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిటన్ వేదికగా పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఇండియాకూ పాకింది. ఇప్పుడు దేశంలోనూ ఈ కొత్తరకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో ఐదుగురిలో యూకే స్ట్రెయిన్ నిర్ధారణ అయినట్టు కేంద్రం ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో దేశంలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25కు చేరింది.
Also Read: ప్రపంచ మెడికల్ హబ్ గా ఇండియా మారబోతుందా?
పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ ల్యాబ్‌లో నాలుగు, ఢిల్లీలోని ఐజీఐబీ ల్యాబ్‌లో ఒక కేసు నిర్ధారణ అయినట్టు తెలిపింది. అయితే.. ఈ ఐదుగురు ఏ రాష్ట్రానికి చెందినవారు అనే వివరాలను మాత్రం ఎక్కడా చెప్పలేదు. మంగళవారం తొలిసారిగా ఆరు కేసులు, బుధవారం 14 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే.. దేశంలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 96 లక్షలకు మించిందని.. రికవరీ రేటు 96 శాతంగా నమోదైందని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా మరో 21,994 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా కేరళలో 6,268 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. అలాగే, కరోనాతో మరో 299 మంది ప్రాణాలు కోల్పోయారు.
రైతు చట్టాలకు వ్యతిరేకించిన సీఎం విజయన్..!
Also Read: రైతు చట్టాలకు వ్యతిరేకించిన సీఎం విజయన్..!
దేశంలో మొత్తం 1,02,67,283 మంది కరోనా వైరస్ బారినపడగా.. 98,59,762 మంది కోలుకున్నారు. అలాగే, 1,48,774 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం 2,55,898 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం నిర్ధారణ అయిన కేసుల్లో మూడు కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పుణేలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీరిలో యూకే నుంచి వచ్చిన వరంగల్ వాసి, రాజమండ్రి మహిళకు కొత్త వైరస్ నిర్ధారణ అయ్యింది. కాగా.. కొత్త స్ట్రెయిన్ బారిన పడిన వారు ఆయా రాష్ట్రాల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. వారితో కాంటాక్ట్ అయినవారు, సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కు పంపించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్