PM Modi- Opposition: ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తల బలం.. ప్రజల ఆశీర్వాదం ఉండాలి. కానీ భారతీయ జనతాపార్టీకి ఈ రెండింటితోపాటు మరో బలం తోడైంది. అదే విపక్షాల వీక్నెస్. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఉన్న వివిధ పార్టీలన్నీ ఒకేగూటికిందకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వారివారి సొంత ప్రయోజనాలు.. ఆధిపత్య ధోరణి, కొంతమంది నేతల వ్యక్తిగత ఆలోచన విధానాలు విపక్ష కూటమిలో చీలిక తెస్తున్నాయి. ఈ అంశాలే నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి బలంగా మారుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో చీలిన విపక్షం..
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న వారికి మోదీ బలం బీజేపీ కాదు విపక్షాలేనన్న విషయం అర్థమవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఎన్డీఏ పక్షాలకు ఉన్న ఓట్లు కంటే ఎక్కువే పోలయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మద్దతుగా ఉన్నవారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేసినట్లుగా కౌంటింగ్‌ను బట్టి తెలుస్తోంది. అంటే విపక్ష పార్టీల ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Drunken Female Teacher: మద్యం తాగి పాఠశాలకు వచ్చిన టీచర్.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా?
ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఆధిపత్య పోరు..
ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి విపక్షాల్లో కాంగ్రెస్ తర్వాత అంత బలంగా ఉన్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్. విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను బరిలో నిలిపారు. అయితే ఈసారి విపక్షాల బలహీనత అభ్యర్థి ఎంపిక సమయంలోనే బయటపడింది. విపక్ష అభ్యర్థిని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రకటించారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో తమను సంప్రదించలేదని తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ అలకబూనారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. దీంతో విఫక్షాలు అప్రమత్తమయ్యాయి. తృణమూల్ తప్పుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా స్వయంగా స్పందించారు. ఇది కోపానికి సమయం కాదని, అహం ప్రదర్శించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. దీంతో వెనక్కితగ్గిన దీదీ మార్గరెట్‌కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. ఈమేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి హామీ ఇచ్చారు.
టీఎంసీ, టీఆర్ఎస్కు పోరాటం తప్పని పరిస్థితి..
ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే జాతీయంగా బీజేపీతో వ్యతిరేక పోరాటం చేయడానికిసిద్ధంగా లేదని ఇటీవలి రాష్ట్రపతి ఎన్నికల్లో నిరూనణ అయింది. అయితే మమతాబెనర్జీ సారథ్యంలోని టీఎంసీ, కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్కు మాత్రం కేంద్రంతో పోరాటం తప్పనిసరిగా మారింది. లేనిపక్షంలో ఆ పార్టీలను కూడా బీజేపీ మింగేసే ప్రమాదం ఉంది. దీంతో మమతా, కేసీఆర్ వేదిక ఏదైనా బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాను రాను దారుణంగా మారుతోంది. ఇతర పార్టీలు బీజేపీకి సామంతులుగా ఉంటున్నాయి. పోరాడుతున్న ఒకటి రెండు పార్టీలకు గత్యంతరం లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మోదీకి ఎదురుండన భావించడం లేదు. మోదీని ఎదుర్కోగల సమర్థుడైన నేత లేనప్పుడుం ఏ ఎన్నికలు జరిగినా ప్రయోజనం ఉండదు. ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తేనే ఓటేస్తారు. లేకపోతే.. వాతలు పెట్టిన వారికి ఎదురెళ్లి గండం తెచ్చుకోవాలని అనుకోరు. ఇప్పుడు దేశ ప్రజలది అదే పరిస్థితి. అందుకే మోదీకి బలం విపక్షాలేనని అనుకోవాల్సిన పరిస్థితి.
Also Read:Rupee Falling: రూపాయి విలువ పడిపోతే మనకేమవుతుంది..?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Narendra modis secret weapon a useless opposition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com