Shyam Singaroy Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24 తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో పాన్ ఇండియా రెంజ్ లో విడుదల చేస్తున్నారు. నాని కేరీయర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావడం విశేషం. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా జరుపు కుంటుంది. ఈ మూవీలో బెంగాలీ బాబుగా నాని మేకోవర్ ఆకట్టుకుంటోంది.
కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రెయిలర్ ను ప్రీ రిలీజ్ ఎవెంట్ లో లాంఛ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అయిన నాని, సాయి పల్లవిల ఫోటో అందర్నీ ఆకట్టుకుంటుంది. కాగా ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సత్యదేవ్ జంగా కథ అందించారు. మరి ఈ సినిమా నానికి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి. ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ వెదుకను వరంగల్ లోని రంగలీల మైదానంలో డిసెంబర్ 14 న గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
https://twitter.com/NiharikaEnt/status/1470272825504120834?s=20
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More