Naga Chaitanya- Samantha: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడలేదు. కానీ సామ్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చైతు వరకూ వెళ్లినట్టు ఉన్నాయి. తాజాగా సమంత గురించి నాగచైతన్య కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశాడు. నాగచైతన్య ప్రస్తుతం ‘థ్యాంక్యూ యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ సందర్భంగా చైతు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ర్యాపిడ్ క్వశ్చన్స్ అంటూ ఐదు డబుల్ మీనింగ్ పదాలు చెప్పాలని యాంకర్ చైతుని కోరాడు. అయితే.. ఈ మాటకు చైతు తనదైన శైలీలో సమాధానం ఇస్తూ.. ‘నాకు డబుల్ మీనింగ్ పదాలు తెలియవు. నేను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తాను. డబుల్ మీనింగ్‌లో మాట్లాడడం నాకు ఎప్పటికీ రాదు’ అంటూ నాగచైతన్య కామెంట్స్ చేశాడు.
Also Read: Senior Hero Naresh: నరేశ్ ముగ్గురు భార్యలు ఎవరు..? అసలు ఆయన ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు..?
అయితే, సామ్ ను దృష్టిలో పెట్టుకునే.. ఏ విషయాన్ని అయినా తాను సూటిగా చెప్తానని చైతు చెప్పాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ మధ్య తన విడాకుల గురించి సామ్ డబుల్ మీనింగ్‌లో మాట్లాడడం జరిగింది. ఆ మాటలకు చైతు ఇప్పుడు కౌంటర్ ఇచ్చాడు. ఇక వినూత్నమైన చిత్రాలకు విక్రమ్ కె కుమార్ పెట్టింది పేరు. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా ఈ “థాంక్యూ” చిత్రం రాబోతుంది.
ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లో చైతు ఒక ఎన్నారైగా నటిస్తున్నాడు. చైతు పాత్ర వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక చైతు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి వస్తాడని.. ఈ జర్నీలో గొప్ప సెంటిమెంట్ తో సాగే సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం నేపథ్యం చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందట.
నిజానికి ఈ సినిమా కథ గురించి మరో రూమర్ కూడా బాగా వినిపిస్తోంది. ఓ మధ్యతరగతి అబ్బాయి ఎన్నో కష్టాలు పడి.. ఇంటర్ నేషనల్ గా ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారాడు ? ఈ క్రమంలో అతను ఎలాంటి అపజయాలు పొందాడు అనే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయట. అదేవిధంగా తన విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ అతను థాంక్స్ ఎలా చెప్పాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More