HomeMoviesNTR - Megastar Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్ని...

NTR – Megastar Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసా?

NTR – Megastar Chiranjeevi: స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అదే స్థాయి ప్రేక్షాదరణ పొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది..చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి సినిమాని చూడడానికి థియేటర్స్ వైపు బారులు తీసేవారు..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న చిరంజీవి సినిమాని నిలిపివేయాలంటూ ఎన్టీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది..ఆ సినిమా పేరు అల్లుడా మజాకా.. EVV సత్యనారాయణ గారి దర్శకత్వం లో చిరంజీవి హీరో గా..రమ్య కృష్ణ మరియు రంభాలు హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఒక్కొక్కటి సెన్సషనల్ హిట్ గా నిలిచాయి..ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు బయట వినిపిస్తూనే ఉంటాయి..అయితే ఈ సినిమాకి విడుదల కి ముందు ఎందుకు ఎన్టీఆర్ ప్రభుత్వం అడ్డుపడింది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

NTR - Megastar Chiranjeevi
NTR – Megastar Chiranjeevi

Also Read: Ambati Rambabu Vs Janasena: అంబటి రాంబాబును తగులుకున్న జనసేన

అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి అప్పట్లో సెన్సార్ బోర్డు సభ్యులు A సర్టిఫికెట్ ఇచ్చారు..సినిమాలో అడల్ట్ కంటెంట్ బాగా ఉండడం తో వారు ఈ సర్టిఫికెట్ ని జారీ చేసారు..ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వం అల్లుడా మజాకా సినిమాని ఆపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది..దీనితో మెగాస్టార్ చిరంజీవి ఫాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

Alluda Mazaka:
Alluda Mazaka:

Also Read: Rajendra Prasad- Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ కు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఏదో తెలుసా?

తమ అభిమాన హీరో సినిమాని విడుదల చేసేందుకు అనుమతిని ఇవ్వాలంటూ హైదరాబాద్ కి వెళ్లి ప్రబ్యత్వ కార్యాలయాల ముందు ధర్నాలు..అలాగే భాగ్యనగర వీధుల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు..కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు..రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి ఫాన్స్ టెంట్లు వేసి నిరసన కూడా వ్యక్తం చేసారు..ఈ విషయం ని తెలుసుకున్న ఎన్టీఆర్ సర్కార్ ఒక మెట్టు కిందకి దిగి అల్లుడా మజాకా సినిమా ని విడుదల చేసుకునేందుకు అనుమతిని ఇచ్చింది..అలా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 47 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది.
Recommended Videos
మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వెయ్యండి || Rayapati Aruna Interacts With Public || Pawan kalyan
అందుకే వైసీపీకి సపోర్ట్ చేశా || Nikhil Siddharth Shocking Comments On AP Politics || Ok Telugu ENT
పవన్ కి 50 కోట్ల ఫైన్ వేసిన స్టార్ నిర్మాత || Bhavadeeyudu Bhagat Singh || Pawan Kalyan || Harish
షాకింగ్ నిర్ణయం తీసుకున్న రావు రమేష్.. కారణం అదే || Rao Ramesh Sensational Decision || Ok Telugu ENT

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version