Homeఅప్పటి ముచ్చట్లుసీఎంగా ఉండి కూడా లేచి నిలబడి ఆహ్వానించేవారట

సీఎంగా ఉండి కూడా లేచి నిలబడి ఆహ్వానించేవారట

SR NTR

అది ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. రాజకీయాలతో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. మరోపక్క బాలయ్య బాబు సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతున్నాయి. పరిస్థితి ఎన్టీఆర్ కి అర్ధమైంది. ఇలాగే ఈ ప్లాప్ ల పరంపర కొనసాగితే.. బాలయ్యకి వచ్చిన స్టార్ డమ్ పోతుందని.. ఇక ఎన్టీఆరే రంగంలోకి దిగారు. బాలయ్యతో తానే ఒక సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు.

కట్ చేస్తే.. వరుస సక్సెస్ లు ఇస్తున్న దర్శకుడు కోదండరామిరెడ్డి గురించి ఎన్టీఆర్ అడిగారు. అప్పుడు చిరంజీవి సినిమా సెట్ లో షాట్ బిజీలో ఉన్న కోదండరామిరెడ్డికి సీఎం ఎన్టీఆర్ గారి నుండి ఫోన్ వచ్చిందని మేనేజర్ వచ్చి చెప్పారు. ఫోన్ లో ‘బాలకృష్ణతో ఎన్టీఆర్ గారు మీ చేత సినిమా చేయించాలనుకుంటున్నారు. మరి మీకు దర్శకత్వం వహించడం ఇష్టమేనా.

పెద్దాయన (ఎన్టీఆర్) మిమ్మల్ని అడగమన్నారు. మీకు ఇష్టమైతే ఒకసారి వచ్చి ఎన్టీఆర్ గారిని కలవండి’ అంటూ రామక‌ృష్ణా స్టూడియోస్ నుంచి బాలకృష్ణ మేనేజర్ ఫోన్ లో క్లుప్తంగా విషయం చెప్పేశాడు. కోదండరామిరెడ్డి మద్రాసు నుంచి హైదరాబాద్‌ కు వచ్చి ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కలిశారు. తెల్లారి నాలుగున్నరకు అబిడ్స్‌ లోని ఎన్టీఆర్ ఇంటి వరండాలో కోదండరామిరెడ్డి ఎదురుచూస్తూ ఉన్నారు.

ఎన్టీఆర్ బయటకు వచ్చి కోదండరామిరెడ్డిని చూసి ఆప్యాయంగా పలకరించారు. కాసేపు మాట్లాడి.. బాలయ్య కోసం మంచి కథను మీరే ఎంపిక చేయండి అంటూ పూర్తి బాధ్యతను కోదండరామిరెడ్డి మీదే పెట్టారు. కథ రెడీ అయింది. ఎన్టీఆర్ గారికి చెప్పాలి. దాంతో సినిమా చర్చల నిమిత్తం రోజూ కోదండరామిరెడ్డి అబిడ్స్‌ లో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాల్సి వచ్చేది.

అయితే అక్కడకి వెళ్లేసరికి అప్ప్పటికే ఎంతో మంది అధికారులు, మంత్రులు ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. కానీ ఎన్టీఆర్ మాత్రం, ముందుగా కోదండరామిరెడ్డి అండ్ అతని టీమ్ నే పిలిచి మాట్లాడేవారు. వాళ్ళు గదిలోకి వెళ్లగానే సీఎం పదవిలో ఉండి కూడా ఎన్టీఆర్ గౌరవంగా లేచి నిలబడి ‘‘రండి బ్రదర్’’ అని వాళ్ళను ఆహ్వానించేవారట. ఒక రాష్ట్రానికి అధినేత ఒక సినిమా దర్శకుడికి ఇచ్చిన గౌరవం అది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version