‘Thank you’ 7 Days Collections: విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన థాంక్యూ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ‘థాంక్యూ’ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.
ముందుగా ఈ సినిమా 7 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 1.09 కోట్లు
సీడెడ్ 0.70 కోట్లు
ఉత్తరాంధ్ర 0.52 కోట్లు
ఈస్ట్ 0.30 కోట్లు
వెస్ట్ 0.29 కోట్లు
గుంటూరు 0.34 కోట్లు
కృష్ణా 0.29 కోట్లు
నెల్లూరు 0.33 కోట్లు
ఏపీ + తెలంగాణలో 7 రోజుల కలెక్షన్స్ గానూ 3.87 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 7.64 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.84 కోట్లు
Also Read: Groom died: పెళ్లి మండపంపై వరుడిని మృత్యువు ఎలా కబళించిందో తెలుసా? వైరల్ వీడియో
టోటల్ వరల్డ్ వైడ్ గా 7 రోజుల కలెక్షన్స్ గానూ 4.71 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 7 రోజుల కలెక్షన్స్ గానూ థాంక్యూ రూ. 9.42 కోట్లను కొల్లగొట్టింది
థాంక్యూ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 30 కోట్లు జరిగింది. ఇంకా 30.50 కోట్లు రాబట్టాలి. కానీ, 7 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ ప్లాప్ గా నిలిచింది. అసలు సక్సెస్ కి చిరునామా అన్నంత పేరున్న నిర్మాత దిల్ రాజు నుంచి ‘థాంక్యూ’ లాంటి బోరింగ్ ఎమోషనల్ డ్రామా రావడం ఆశ్చర్యకర విషయమే. మొత్తానికి ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.
Also Read: Nayanthara: నయనతార అంటే ఎందుకు పడిచస్తారో తెలుసా? ఆ సీక్రెట్ ఇదే!