Radhika Apte Viral Comments: తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. తనదైన అందంతో అందరిని తనవైపు తిప్పుకుంది. 2010 వచ్చిన రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగులో తెరంగేట్రం చేసిన ఆమె తరువాత కాలంలో బాలయ్యతో నటించి శభాష్ అనిపించుకుంది. బాలకృష్ణతో లెజెండ్, లయన్ సినిమాలు చేసి తనలోని టాలెంట్ ను ప్రదర్శించింది. తద్వారా మంచి మార్కులు కొట్టేసింది. కానీ తరువాత ఇక ఇతర సినిమాల్లో కనిపించలేదు. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
రాధికా ఆప్టే తన సినిమాల్లోనే కాకుండా అభిమానులతో అనుభవాలు పంచుకుంటుంది. తన ఇష్టాయిష్టాలను వారితో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో తన భర్త గురించి కూడా వివరించింది. మీ భర్తలో మీకు నచ్చనిది ఏంటని ప్రశ్నిస్తే ఎత్తు అని ఠక్కున సమాధానం చెప్పింది. ఆయన నాకంటే పొడుగ్గా ఉండటం నాకు ఇష్టం ఉండదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. రాధిక తన భర్త గురించి నిజాలు చెప్పడంతో అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.
Also Read: Kaleshwaram Project: కాలేశ్వరం ప్రాజెక్టుకు ఏమిటి ఈ దుస్థితి?
తన హాట్ ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తుంటుంది. దీంతో అభిమానులు ఆమె ఫొటోలు చూస్తూ సంబరపడిపోతుంటారు. 2005లోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. హిందీలో పలు చిత్రాల్లో నటించినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 2016లో ఆమె నటించిన పార్చ్ డ్ సినిమాతో ప్రేక్షకుల్లో ఆగ్రహం పెరిగింది. ఇక ఆమె సినిమాలు చూడొద్దనే నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఇక అప్పటి నుంచి అభిమానుల కోపానికి గురైన రాధిక ప్రస్తుతం వారితో బాగానే ఉంటోంది.
సెప్టెంబర్ నాటికి తనకు 37 ఏళ్లు వస్తాయని చెబుతోంది. సాధారణంగా భర్తలు భార్యల కంటే పొడుగ్గానే ఉంటారు. కానీ ఆ పొడుగే నచ్చదని రాధిక కామెంట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. రాధిక అభిమానులు తెగ చూస్తున్నారు. ఆమె మాటల్లోని ఆంతర్యమేమిటో అని ఆలోచిస్తున్నారు. భర్తల గురించి నిజాలు చెప్పడం కొందరు చేయరు. కొందరైతే తన మనసులో ఉన్న మాటను బయటకు చెప్పడంలో తటపటాయించరు. రాధిక కూడా అదే కోవకు చెందుతుంది. అందుకే తన భర్తపై అన్ని విషయాలు పంచుకోవడంతో అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు.
Also Read: Bimbisara Heroine Samyuktha Menon: ‘బింబిసార’ హీరోయిన్ తో హీరో ధనుష్ గొడవ.. అసలేం జరిగిందంటే ?