https://oktelugu.com/

Shyam Singha Roy Day 11 collections: ‘శ్యామ్ సింగరాయ్’ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Shyam Singha Roy Day 11 collections: నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. కాగా విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే, ఈ సినిమాకు ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమాకి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇంకా స్టడీగానే థియేటర్ రెవెన్యూను ఈ చిత్రం సాధిస్తోంది. మరి ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 5, 2022 / 02:27 PM IST
    Follow us on

    Shyam Singha Roy Day 11 collections: నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. కాగా విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే, ఈ సినిమాకు ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమాకి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇంకా స్టడీగానే థియేటర్ రెవెన్యూను ఈ చిత్రం సాధిస్తోంది.

    Shyam Singha Roy Day 11 collections

    మరి ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :

    నైజాం 9.05 కోట్లు
    గుంటూరు 1.19 కోట్లు
    కృష్ణా 0.93 కోట్లు
    నెల్లూరు 0.59 కోట్లు
    సీడెడ్ 2.48 కోట్లు
    ఉత్తరాంధ్ర 2.12 కోట్లు
    ఈస్ట్ 0.98 కోట్లు
    వెస్ట్ 0.84 కోట్లు

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 18.18 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా 2.90 కోట్లు
    ఓవర్సీస్ 3.42 కోట్లు

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 24.49 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    Also Read: శ్యాం సింగరాయ్ మూవీ విలన్.. ఇతన్ని తప్ప వేరే వారిని ఊహించుకోలేము

    అన్నట్టు ఈ ‘శ్యామ్ సింగ రాయ్’కి హిట్ ప్లాప్ లతో సంబంధం లేదు. ఎందుకంటే.. ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమా లాభనష్టాలన్నీ నిర్మాతకే సొంతం. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 22కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా అక్కడ ఈ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాలేదు.

    కాకపోతే, ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 22 కోట్లే. అందుకే, ఏపీలో కొన్ని చోట్ల థియేటర్లు మూతపడినా ‘శ్యామ్ సింగ రాయ్’ బ్రేక్ ఈవెన్ సాధించింది. 11 రోజులకు ఈ సినిమాకి రూ.24.49 కోట్ల షేర్ వచ్చింది. అంటే బాక్సాఫీస్ వద్ద రూ.2.49 కోట్ల లాభాల్లోనే ‘శ్యామ్ సింగ రాయ్’ ఉన్నాడు. ఎలాగైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ హిట్ కోసం నాని ఎంతో కసితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేశాడు. అయితే, సినిమా హిట్ అవ్వడంతో నాని ఫుల్ జోష్ లో ఉన్నాడు.

    Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

    Tags