Sammathame 3rd Day Collections: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి దారుణంగా ఉందని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది అని వార్తలు వినిపించాయి. ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు నష్టాలు మాత్రమే మిగిలాయని నెగిటివ్ ప్రచారం చేశారు. అయితే.. సమ్మతమే మూడో రోజు అనూహ్యంగా పుంజుకుని షాక్ ఇచ్చింది.
ముందుగా రెండు రోజులకు గానూ ఈ చిత్రం టోటల్ వరల్డ్ వైడ్ గా 1.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా రూ. 2.21 కోట్లను కొల్లగొట్టింది మరి మూడో రోజు ఈ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం రండి.
ఏరియాల వారీగా గమనిస్తే..
నైజాం 0.52 కోట్లు
సీడెడ్ 0.33 కోట్లు
ఉత్తరాంధ్ర 0.24 కోట్లు
ఈస్ట్ 0.14 కోట్లు
వెస్ట్ 0.13 కోట్లు
గుంటూరు 0.16 కోట్లు
కృష్ణా 0.15 కోట్లు
నెల్లూరు 0.14 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి 3 రోజుల కలెక్షన్స్ గానూ 1.75 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 3.01 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.19 కోట్లు
Also Read: Sharwanand: ఎగబడిన నిర్మాతలు దూరమయ్యారు.. హీరోకి బ్యాడ్ టైం స్టార్ట్ !
టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి 3 రోజుల కలెక్షన్స్ గానూ 1.80 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి 3 రోజుల కలెక్షన్స్ గానూ ‘సమ్మతమే’ రూ. 3.09 కోట్లను కొల్లగొట్టింది
‘సమ్మతమే’ చిత్రానికి రూ.5.78 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూడో రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది. కారణం.. ఈ సినిమా రెండో రోజు 45 లక్షలు కలెక్ట్ చేస్తే.. మూడో రోజు మాత్రం 71 లక్షలు కలెక్ట్ చేసింది. రెండితుల రెట్టింపు కలెక్షన్స్ తో ఈ సినిమా మూడో రోజు జనంలోకి బాగా చొచ్చుకుపోయింది.
Also Read: Ballaya Heroine Sonal Chauhan: బాబోయ్.. బాలయ్య హీరోయిన్ బికినీ అందాలు.. ఇవి గతంలో చూడని ఫోజులు !