Poorna: చీరలో హొయలు పోతున్న బబ్లీ బ్యూటీ పూర్ణ అంటూ నెటిజన్లు ఆమె పై తెగ ప్రేమను కురిపిస్తున్నారు. తాజాగా పూర్ణ చీరలో ఒక ఫోటో షూట్ చేసింది. ఎప్పటిలాగే హోమ్లీ లుక్ లో పూర్ణ ఫిదా చేసింది. అందుకే.. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ పిక్స్ పై మీరు కూడా ఒక లుక్కేయండి.

ఇక హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్స్ సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ సిరీస్లు, సినిమాలలో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు దక్కుతున్నాయి. మొత్తానికి తన ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకున్న పూర్ణ… మడిగట్టుకు కూర్చోకుండా… అందివచ్చిన పాత్రలు కాదనకుండా చేస్తుంది.

ఆ మధ్య వెంకటేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 2లో పూర్ణ లాయర్ రోల్ చేశారు. అఖండ మూవీలో గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. పద్మావతిగా పూర్ణ నటన ఆకట్టుకుంది. సౌత్ లో పలు భాషలలో నటిస్తున్న పూర్ణ… తెలుగులో మాత్రం బాగా పాప్యులర్ అయ్యింది.

అన్నట్లు తన కెరీర్ అనుకున్నంతగా సాగకపోవడానికి… తాను సినిమాపై శ్రద్ధ పెట్టకపోవడమే కారణం అని పూర్ణ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పరిశ్రమలో ఉన్నప్పుడు కొన్నిటికి ఎస్ చెప్పాలి. కానీ నేను నో చెప్పాను. సీమ టపాకాయ్ మూవీ తర్వాత కొన్ని కారణాలతో చాలా ప్రాజెక్ట్స్ వదిలేసినట్లు పూర్ణ ఎమోషనల్ గా వెల్లడించింది.

మొత్తమ్మీద క్యాస్టింగ్ కౌచ్ గురించి పూర్ణ కూడా ఓపెన్ గా మాట్లాడింది. ఇక గతంలో పూర్ణ ఓ కిడ్నాప్ గ్యాంగ్ చెరలో చిక్కుకొని.. అదృష్టవశాత్తు బయటపడింది.

Also Read: Sammathame 3rd Day Collections: ‘సమ్మతమే’కి రికార్డ్ కలెక్షన్స్.. ఇది షాకింగే !
నిజానికి పూర్ణకి కాలం కలిసి రాలేదు. ఆమెకు అందం ఉంది, అభినయం ఉంది, కానీ ఛాన్స్ లు మాత్రం రాలేదు. నిజానికి ‘అఖండ’తో ఈ హోమ్లీ బ్యూటీకి ఘన విజయం వచ్చింది. కానీ, పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం పూర్ణకి ఇంకా రాలేదు.

‘అఖండ’ సినిమా రిలీజ్ అయి నెలలు కావస్తోంది. అయినా… పూర్ణను ఇప్పటివరకు మరో సినిమాలో ఎవ్వరూ పెట్టుకోలేదు.

పూర్ణకి ఛాన్స్ లు రాకపోవడానికి ప్రధాన కారణం.. ఆమె తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిందని.. ప్రస్తుతం పూర్ణ ఒక్కో సినిమాకు 50 లక్షల పైనే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.

Also Read: Regional Parties: ప్రాంతీయ పార్టీలకు నంబర్ 2లతో డేంజర్.. ఉద్దవ్ ఠాక్రే వెనుక జరిగిందిదే
Recommended Videos




[…] […]