https://oktelugu.com/

RRR Latest Collections : అన్నీ చోట్ల అదే విజృంభణ.. !

RRR Latest Collections : విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ టు డేస్ కలెక్షన్స్ తో పాటు మూడో రోజు కలెక్షన్స్ విషయంలోనూ అదరగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 203.07 కోట్లు కలెక్ట్ చేసింది. సెకండ్ టోటల్ వరల్డ్ వైడ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 28, 2022 / 06:21 PM IST
    Follow us on

    RRR Latest Collections : విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ టు డేస్ కలెక్షన్స్ తో పాటు మూడో రోజు కలెక్షన్స్ విషయంలోనూ అదరగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ విషయంలో దుమ్ము లేపుతుంది. ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 203.07 కోట్లు కలెక్ట్ చేసింది. సెకండ్ టోటల్ వరల్డ్ వైడ్ గా 135.50 కోట్లు కలెక్ట్ చేసింది.

    RRR

    మొత్తం మీద సినిమా మూడో రోజు కూడా అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ గమనిస్తే..

    నైజాం మూడో రోజు – 15 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 53 కోట్లు.

    సీడెడ్ లో మూడో రోజు – 5.6 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 22.5 కోట్లు.

    వైజాగ్ లో మూడో రోజు – 4 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 14 కోట్లు.

    ఈస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.75 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 9 కోట్లు.

    వెస్ట్ గోదావరిలో మూడో రోజు – 1.15 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు.

    కృష్ణలో మూడో రోజు – 2 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 8 కోట్లు.

    గుంటూరులో మూడో రోజు – 2 కోట్లు, మొత్తం మూడు రోజులకు గానూ 11 కోట్లు.

    నెల్లూరులో మూడో రోజు – 1 కోటి, మొత్తం మూడు రోజులకు గానూ 4.95 కోట్లు.

    తమిళ్ నాడు 16.17 కోట్లు

    కేరళ 05.07 కోట్లు

    కర్ణాటక 18.47 కోట్లు

    నార్త్ ఇండియా (హిందీ) 36.50 కోట్లు

    ఓవర్సీస్ 56.20 కోట్లు

    రెస్ట్ 04.65 కోట్లు

    మూడో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 275.81 కోట్లు కలెక్ట్ చేసింది.

    Also Read: RGV Tweets On Rajamouli: రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం !

    ఒక తెలుగు సినిమా మూడో రోజు కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. మూడో రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. ఎలాగూ ఎన్టీఆర్ – చరణ్ పేర్లు వింటేనే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటి హీరోలు కలిసి నటించిన సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే.

    ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం భారీ స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం అలాగే ఉంది. చాలా మంది ఫస్ట్ టు డేసే కాదు మూడో రోజు కూడా మూవీ చూసేందుకు ఎగబడ్డారు. ఈ సినిమా అద్భుత హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక ఈ చిత్రానికి తిరుగు లేకుండా పోయింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని తన ప్రభంజనాన్ని సగర్వంగా చాటుకుంది.

    Also Read: MLA Seethakka: దేశాన్ని విడ‌గొట్టేది ఆ సినిమా.. క‌లిపి ఉంచేది ఈ సినిమా.. ఎంతైనా సీత‌క్క స్టైలే వేరు..

    Recommended Video:

    Tags