https://oktelugu.com/

Kodali Nani: మంత్రి కొడాలి నాని స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

Kodali Nani: మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. సమర్థులైన వారి కోసం ఆరా తీస్తున్నారు. కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. కొత్త వారిని ఎంపిక చేసుకునే క్రమంలో సామాజిక సమీకరణలు చూసుకుంటున్నారు. జగన్ కు అత్యంత ఆప్తుడుగా ముందు వరసలో ఉండే కొడాలి నానికి పార్టీ పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జగన్ మంత్రి వర్గంలో ఎవరినైనా అలవోకగా తిట్టే వారిలో నాని ముందంజలో ఉండటం తెలిసిందే. దీంతో ఆయన స్థానంపై అందరిలో ఆసక్తి నెలకొంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 28, 2022 6:54 pm
    Follow us on

    Kodali Nani: మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. సమర్థులైన వారి కోసం ఆరా తీస్తున్నారు. కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. కొత్త వారిని ఎంపిక చేసుకునే క్రమంలో సామాజిక సమీకరణలు చూసుకుంటున్నారు. జగన్ కు అత్యంత ఆప్తుడుగా ముందు వరసలో ఉండే కొడాలి నానికి పార్టీ పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జగన్ మంత్రి వర్గంలో ఎవరినైనా అలవోకగా తిట్టే వారిలో నాని ముందంజలో ఉండటం తెలిసిందే. దీంతో ఆయన స్థానంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

    Kodali Nani

    Kodali Nani

    కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని స్థానం ఎవరితో భర్తీ చేస్తారనే వాదన కూడా వస్తోంది. నాని స్థానంలో కృష్ణా జిల్లాకు చెందిన నేతలకే ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీని ఆదుకునే వారినే ఎంచుకోనున్నారు. దీనికి ఇప్పటికే జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. మంత్రివర్గంలో చాలా మందిని తొలగించి కొత్త వారికే అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.

    Also Read: Somu Veeraju: పవన్ కళ్యాణ్ సీఎం.. 2024లో అధికారం.. ప్రత్యర్థులకు వ్యూహాలు చిక్కనివ్వని సోము వీర్రాజు

    టీడీపీని ఇరుకున పెట్టే టీంను తయారు చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసమే సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. మంత్రి వర్గ విస్తరణపై మళ్లగుల్లాలు పడుతున్నారు. రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసుకుని రంగంలో దిగే వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఉద్ధండులైన నేతల కోసం ఆరా తీస్తున్నారు. మంత్రి పదవి అప్పగించేందుకు ఎవరిలో ఆ లక్షణాలున్నాయా అని వెతుకుతున్నారు.

    కొడాలి నాని స్థానం భర్తీలో జగన్ ఏ వ్యూహం అవలంభిస్తారనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. సీఎం జగన్ ఈ మేరకు ఎవరిని నియమిస్తారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. నానికి ప్రత్యామ్నాయంగా మారే వ్యక్తి కోసం జగన్ నిరంతరం శ్రమిస్తున్నారు. పార్టీని గాడిలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే వీలుందని తెలుస్తోంది. మొత్తానికి దీనిపై ఆంధ్రప్రదేశ్ లో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

    Also Read: AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ఎప్పటికి పూర్తయ్యేనో?

    Recommended Video:

    పవన్ కళ్యాణ్ ఫోకస్ ఆ రెండింటిపైనే || Pawan Kalyan Focus on 2024 Elections || Janasena || Ok Telugu

    Tags