Pushpa 18 Days Collections: ‘పుష్ప’ 18వ రోజుకు బ్రేక్ ఈవెన్.. ఆల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే !

Pushpa 18 Days Collections: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా మొత్తానికి నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయింది. నిజానికి మొదటి రోజు నుంచీ ‘పుష్ప’ కలెక్షన్స్ పై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ సినిమాకు నిజంగానే కలెక్షన్లు వస్తున్నాయా ? లేక, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో వందల కోట్లు అంటూ పోస్టర్స్ డిజైన్ చేసి వదులుతున్నారా […]

Written By: Shiva, Updated On : January 5, 2022 12:50 pm
Follow us on

Pushpa 18 Days Collections: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా మొత్తానికి నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయింది. నిజానికి మొదటి రోజు నుంచీ ‘పుష్ప’ కలెక్షన్స్ పై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ సినిమాకు నిజంగానే కలెక్షన్లు వస్తున్నాయా ? లేక, మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో వందల కోట్లు అంటూ పోస్టర్స్ డిజైన్ చేసి వదులుతున్నారా ? ఇలా అనేక అనుమానాలు. సరే.. మొత్తమ్మీద సినిమా అయితే విజయాల తీరం చేరకపోయినా అపజయం నుంచి మాత్రం బయట పడింది.

Pushpa 18 Days Collections

కాగా బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా రిలీజ్ అయి 18 రోజులు అవుతున్నా.. తన ప్రభావాన్ని బాగానే చూపిస్తోంది. మొత్తానికి ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి ‘అల్లు అర్జున్’ చేసిన ఈ పాన్ ఇండియా ప్రయత్నం పర్వాలేదు అనిపించుకుంది.

మరి పుష్ప 18 రోజుల కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా చూస్తే..

నైజాం 36.60 కోట్లు
సీడెడ్ 14.06 కోట్లు
వెస్ట్ 4.04 కోట్లు
గుంటూరు 5.25 కోట్లు
కృష్ణా 4.14 కోట్లు
నెల్లూరు 3.06 కోట్లు
ఉత్తరాంధ్ర 7.83 కోట్లు
ఈస్ట్ 4.87 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 79.85 కోట్లు

తమిళ్ నాడు 10.00 కోట్లు
కర్ణాటక 10.25 కోట్లు
రెస్ట్ 29.00 కోట్లు
ఓవర్సీస్ 12.35 కోట్లు
కేరళ 4.95 కోట్లు

Also Read: మహేష్ అసలు ఇది మనస్ఫూర్తిగానే చేశాడా ?

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 146.40 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.

‘పుష్ప’ అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.145.5 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే 18 రోజుల కలెక్షన్స్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసింది. ఇక నేటి నుంచి వచ్చే కలెక్షన్స్ మరియు మిగిలిన అన్ని రైట్స్ తాలూకు డబ్బులు అన్నీ లాభాల కిందకే వస్తాయి.

కాకపోతే ఈ చిత్రం అన్నీ చోట్ల బ్రేక్ ఈవెన్ ను సాధించినా.. ఆంధ్రలో మాత్రం నష్టపోయింది. అక్కడ బయ్యర్లకు పుష్ప భారీ నష్టాలను మిగిల్చింది.

Also Read: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే ?

Tags