Ganesh Pooja: హిందువులకు దైవభక్తి మెండు. పొద్దున లేచింది మొదలు పూజలు చేస్తూనే ఉంటారు. హారతి ఇవ్వనిదే అన్నమైనా ముట్టరు. అలాంటి మన దేశంలో దేవుళ్లకు కొదవే లేదు. గ్రామ దేవతల నుంచి ఎంతో మంది దేవతలను కొలుస్తుంటారు. అన్ని దేవుళ్లకంటే ఆదిదేవుడు వినాయకుడే. గణపతికి పూజ చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. దీంతో తెల్లవారిందే మొదలు ఆయనకు పూజ చేసేందుకు ముందుంటారు.

గణపతిని పూజ చేసేందుకు కొన్ని నియమాలు కూడా ఉండటం తెలిసిందే. అయితే తెల్లజిల్లేడు చెట్టుతో చేసిన గణపతి విగ్రహాన్ని శ్వేతార్క గణపతి అంటారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు తొలగిపోతాయని చెబుతారు. శ్త్వేతార్క గణపతిని పూజిస్తే సంపదలు, సుఖశాంతులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తెల్లజిల్లేడు చెట్టును ఇంట్లో కూడా నాటుకుని ప్రతి రోజు పూజ చేస్తారు. దీనికి ఉన్న విలువ అలాంటిది.
Also Read: Nampally Court: కోర్టు తీర్పు బీజేపీకి అస్త్రంగా మారిందా?
శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకోవాలంటే ముహూర్తం చూసుకోవాలి. పండితులను కలిసి మంచి సమయం చూసుకుని ఇంట్లో ప్రతిష్టించుకోవాల్సి ఉంటుంది. దీంతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. శ్వేతార్క గణపతి పూజలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. శ్వేతార్క గణపతిని శుభ్రంగా కడిగి ఎర్రని వస్త్రంపై ఉంచి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వాసం.

జిల్లేడుతో చేసిన గణపతితో జాతక చక్రంలో సూర్యుడు నీచస్థితిలో ఉన్నవారు, ఇంటికి వీధిపోటు, వాస్తు దోషాలు ఉంటే శ్వేతా గణపతిని పూజిస్తే అన్ని దూరమవుతాయి. తెల్ల జిల్లేడును పవిత్రంగా భావిస్తారు. దాని ఆకులను కూడా పూజలో వినియోగిస్తారు. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నంగా సూచిస్తారు. అందుకే తెల్ల జిల్లేడు చెట్టుతో చేసిన గణపతికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుందని తెలుసుకుని అందరు తమ ఇళ్లల్లో ప్రతిష్టించుకునేందుకు ఆలోచిస్తున్నారు. ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజలు చేసి అన్నింట్లో విఘ్నాలు లేకుండా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Gudivada Amarnath: తలబడుతూ.. నిలబడిన గుడివాడ కుటుంబం.. సుదీర్ఘ నిరీక్షణకు అమర్ నాథ్ కు దక్కిన ఫలితం