https://oktelugu.com/

Ante Sundaraniki Day 1 Collections: అంటే సుందరానికి మొదటి రోజు వసూళ్లు.. నాని కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్స్

Ante Sundaraniki Day 1 Collections: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘానంగా విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే.. చాలా కాలం తర్వాత నానీ నుండి వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో విడుదలకి ముందు నుండే మంచి అంచనాలే ఉన్నాయి..టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం తో ఓపెనింగ్స్ అదిరిపోవడం పక్కా అనుకున్నారు..బోనస్ గా మొదతో రోజు మొదటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 11, 2022 / 03:08 PM IST

    Ante Sundaraniki

    Follow us on

    Ante Sundaraniki Day 1 Collections: న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘానంగా విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే.. చాలా కాలం తర్వాత నానీ నుండి వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో విడుదలకి ముందు నుండే మంచి అంచనాలే ఉన్నాయి..టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం తో ఓపెనింగ్స్ అదిరిపోవడం పక్కా అనుకున్నారు..బోనస్ గా మొదతో రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ కూడా వచ్చింది.. కాను ఎందుకో ఓపెనింగ్స్ మాత్రం అందరూ ఊహించిన స్థాయి లో మాత్రం రాబట్టేలేక పోయింది ఈ మూవీ.. నానీ కెరీర్ లోనే వీకేస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది..ప్రేక్షకులు అందరూ ఇటీవల కాలం లో వరుసగా సూపర్ హిట్ సినిమాలకు డబ్బులు విపరీతంగా ఖర్చు చెయ్యడం వలనో ఏమో కాని.. దాని ప్రభావం మాత్రం ఈ మూవీ మీద గట్టిగా పడింది అనే చెప్పాలి.. కమల్ హాసన్ హీరో గా నటించిన విక్రమ్ సినిమా అన్నీ బాషాలతో పాటుగా తెలుగు లో ఇప్పటికి అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకి దూసుకుపోతుంది.. ఆ చిత్ర ప్రభావం ఈ సినిమా మీద కచ్చితంగా పడి ఉంటుంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.. ఇది పక్కన పెడితే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను దక్కించుకుందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Ante Sundaraniki

    Also Read: Megastar Chiranjeevi Childhood Photo: మెగా స్టార్ చిరంజీవి చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా?

    మాములుగా నైజాం ఏరియా లో నాని సినిమాలకు మంచి వసూళ్లు వస్తుంటాయి..ఆయన గత చిత్రం శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా ఈ ప్రాంతం లో మంచి వసూళ్లను దక్కించుకుంది..అంటే సుందరానికి సినిమా కామెడీ ఎంటర్టైనర్ కావడం తో ఈ సినిమాకి ఈ ప్రాంతం లో ఓపెనింగ్స్ అదిరిపోతాయి అని అందరు అనుకున్నారు.. కాని ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమాకి ఇక్కడ మొదటి రోజు కేవలం 1.56 కోట్లు మాత్రమే వసూలు చేసింది.. ఇది నానీ రేంజ్ కి చాలా వీక్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి..రాయలసీమ ప్రాంతం లో 38 లక్షల రూపాయిలు షేర్ ని సాధించిన ఈ సినిమా ఉత్తరాంద్ర ప్రాంతం లో 44 లక్షలు..ఈస్ట్ గోదావరి జిల్లాలో 34 లక్షలు.. వెస్ట్ గోదావరి జిల్లాలో 34 లక్షల రూపాయిల షేర్స్ ని సొంతం చేసుకుంది..ఇక గుంటూరు జిల్లాలో 34 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ సినిమా..కృష్ణ జిల్లాలో 28 లక్షలు, నెల్లూరు జిల్లాలో 19 లక్షల రూపాయిల షేర్స్ ని వసూలు చేసింది.. మొత్తం మీద ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 3.87 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది.. ఇంత తక్కువ ఓపెనింగ్ నాని కెరీర్ లో ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు..ఇక నానీ కి మంచి పట్టు ఉన్న usa లో కూడా ఈ సినిమా కేవలం 1.70 కోట్లు మాత్రమే వసూలు చేసింది.. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్నీ ప్రాంతాలకు కలిపి 5.82 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది.. ఈ మాత్రం వసూళ్లు కూడా పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా గా రావడం వల్లే వచ్చాయి అని.. లేకపోతే ఇంకా తక్కువ వచ్చేవి అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త.. కాని సినిమాకి మంచి టాక్ రావడం వల్ల ఫుల్ రన్ బాగుండే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.. చూడాలిమరి!.

    Also Read: Gang Rape Case: గ్యాంగ్ రేప్ కేసు: బాలిక మెడికల్ రిపోర్టులో దారుణ నిజాలు

    Recommended Video:

    Tags