Electric Vehicles: హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వెహికిల్స్.. ఇటీవల కాలంలో వీటి వినియోగం పెరుగు తోంది. దీనికి ప్రధానంగా రెండు కారణా లున్నాయి. ఒకటి ఇంధన ధరలు పెరగడం, మరొకటి పర్యావరణానికి హాని కలుగక పోవడం. ఈ రెండు కారణాల వల్ల చాలామంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను వినియోగించేందుకు ముందుకు వస్తు న్నారు. అయితే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా కొన్ని ఎలక్ట్రిక్ వెహికిల్స్ దగ్ధమవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూవీలర్స్ పేలిపోతున్నాయి.
మరికొన్ని చోట్ల మంటలు చెలరేగి వ్యక్తులు చనిపోతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆహుతవుతున్న నేపథ్యంలో దేశంలోని ఎలక్ట్రిక్ వాహన దారులు ఆందోళన చెందుతున్నారు. అసలు (ఎలక్ట్రిక్ వెహికిల్స్) ఈవీ వాహనాలంటేనే చాలా మంది భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రముఖ సంస్థలు రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు సైతం పేలిపోతున్నాయి. అసలు ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోవడానికి కారణాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లోపభూయిష్ఠంగా ఉండటమే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణమని ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది.
Also Read: Singareni: ఆఖరుకు తెలంగాణ వచ్చాక ‘సింగరేణిని’ ముంచేశారా?
ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి తీస్తామో అన్ని సార్లు ఖచ్చితంగా కనెక్టింగ్ పాయింట్స్ వద్ద స్పార్కింగ్ వస్తుంది. ఆ సమయంలో ఆ పాయింట్స్ బర్న్ అయ్యి … ప్లగ్ అనేది లోపలి వెళ్ళదు. ప్లగ్ పూర్తిగా లోపలి వెళ్లదు. ప్లగ్ సగం వరకే లోపలి వెళుతుంది. దీనివల్ల లూజ్ కాంటాక్ట్ అవుతుంది. ఈ కారణంగా కొద్దీ సేపు వెహికిల్ నడిచిన తరువాత హీట్ జనరేట్ అవుతుంది. ప్లగ్ లూజ్ అవ్వడంతో బైక్ రన్నింగ్ లో ఉన్నపుడు ఆ ప్లగ్ పై మరింతగా లోడ్ పడడంవల్ల మంటలు చెలరేగుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాపర్ గా ఛార్జింగ్ ప్లగ్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ సురక్షితంగా ఉంటాయని వారు అంటున్నారు. ప్లగ్ పెట్టి ఛార్జింగ్ చేసే సమయంలో బ్లాస్ట్ అవ్వవు. పది కిలోమీటర్లు దాటినతర్వాతనే పేలిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్లగ్ కనెక్ట్ చేసేటప్పుడు పూర్తిగా కనెక్ట్ అయ్యి లాక్ పడిందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోయే ప్రమాదం ఉంది. బ్యాటరీ విషయంలో ఖచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు లేని సెల్స్ వాడడం కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోతున్నాయి. చైనా నుంచి వచ్చే క్వాలిటీ సెల్స్ మార్కెట్ లో అందుబాటులో లేకపోవడంతో నాసిరకమైన సెల్స్ ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఈవీ వెహికల్స్ లో మంటలు చెలరేగడానికి ముఖ్య కారణమని మార్కెట్ నిపుణులు వెల్లడి స్తున్నారు. పలు కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. ఇది కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కాలడానికి ఒక కారణం. వర్షాలు పడినప్పుడు కూడా నీరు బ్యాటరీలోపలికి వెళ్లడంవల్ల కొన్ని వాహనాల్లో మంటలు వస్తున్నాయి. అంతేకాదు ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవు తున్నప్పుడు కూడా బ్యాటరీలు ఎక్కువసేపు పెట్టి వదిలేయ కూడదు. అలా వదిలేయడంవల్ల కూడా బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే తప్పుడు గానీ, తీసేటప్పుడు గానీ జాగ్రత్తలు పాటించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేటప్పుడు కష్టమర్లు బ్యాటరీకి సంబంధించిన టుర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారంటీ ఎంత..? వాడకం,
ఛార్జింగ్ పెట్టడం, తీయడం వంటి వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మకందారులు చెప్పిన ప్రకారం బ్యాటరీ మైలేజ్ ఇవ్వకపోయినా వారిని సంప్రదించాలి. పవర్ స్విచ్ ఆఫ్ లో ఉన్నపుడే ఛార్జర్ పాయింట్ ను బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత ప్లగ్ ఇన్ చేసి పవర్ ఆన్ చేయాలి. చార్జింగ్ తీసేటప్పుడు కూడా ఫస్ట్ బ్యాటరీ ప్లగ్ డిస్ కనెక్ట్ చేసి, ఆ తర్వాత పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలను సురక్షితంగా ఉంచుకోవడానికి వీలవుతుంది.
Also Read: Minister kTR: కేటీఆర్ చైనా జపం.. ఆయన వ్యాఖ్యల వెనుక అర్థం అదేనా?