సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. అయినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తటపటాయిస్తోంది. నిజానికి పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని సీఎం జగన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అతడిని తప్పించి కొత్త ఎన్నికల కమిషన్ వచ్చాక ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ భావిస్తోంది.
Also Read: ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు కీలక నిర్ణయం
దీనిలో భాగంగా జగన్ సర్కార్ నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్ ను తప్పించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కనకరాజ్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీనిపై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లడంతో అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈక్రమంలోనే కొద్దిరోజులు నిమ్మగడ్డకు జగన్ కు మధ్య వార్ నడించింది. నిమ్మగడ్డ ప్రసాద్ ఈ వ్యవహరాన్ని గవర్నర్ కు దృష్టికి తీసుకెళ్లడంతో చివరికీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆయనే తిరిగి నియామకమయ్యారు.
నిమ్మగడ్డ ప్రసాద్ పదవీలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ సమయంలోనే కరోనా రావడంతో ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా పంచాయతీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. అయితే ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం పెద్దగా సహకారం అందడం లేదు.
Also Read: బీజేపీ వైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల చూపు..!?
దీంతో నిమ్మగడ్డ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సైతం కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేదని కోర్టుకు విన్నవించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. దీంతో హైకోర్టు తీర్పు ఎన్నికల కమిషనర్ కే అనుకూలంగా రానుందని తెలుస్తోంది.
ఈనేపథ్యంలోనే ఇక పంచాయతీ ఎన్నికలు ఆగేలా లేకపోవడంతో వైసీపీ నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో పెండింగ్ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. సంక్షేమ పథకాలు.. నగదు బదిలీ వంటివి జనవరిలోపు లబ్ధిదారులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్న ఇళ్ల పట్టాలను సైతం వైసీపీ నేతలు పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం సందడి షూరు అయినట్లు కన్పిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్