https://oktelugu.com/

ఆ హీరోయిన్ కే ‘నాని’ ఛాన్స్.. ఎందుకంటే !

కొంతమంది హీరోయిన్స్ కి అన్ని ఉన్నా.. అదృష్టం అనేది లేక అవకాశాలు రావు. హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా పక్కా భారీ గ్లామర్ బ్యూటీ అయినా ఎందుకో హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయిన యంగ్ బ్యూటీస్ లో ‘మడోన్నా’ అనే బ్యూటీ ఒకటి. మడోన్నా అంటే ఎవ్వరికీ గుర్తు ఉండదు గానీ, ఈ బ్యూటీని చూడగానే గుర్తు పట్టేస్తారు. నాలుగేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన “ప్రేమమ్” అనే సినిమా గుర్తుందా కదా.. నాగ […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 06:03 PM IST
    Follow us on


    కొంతమంది హీరోయిన్స్ కి అన్ని ఉన్నా.. అదృష్టం అనేది లేక అవకాశాలు రావు. హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా పక్కా భారీ గ్లామర్ బ్యూటీ అయినా ఎందుకో హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయిన యంగ్ బ్యూటీస్ లో ‘మడోన్నా’ అనే బ్యూటీ ఒకటి. మడోన్నా అంటే ఎవ్వరికీ గుర్తు ఉండదు గానీ, ఈ బ్యూటీని చూడగానే గుర్తు పట్టేస్తారు. నాలుగేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన “ప్రేమమ్” అనే సినిమా గుర్తుందా కదా.. నాగ చైతన్య హీరోగా నటించిన ఆ సినిమాలో శృతి హాసన్, అనుపమతో పాటు మడోన్నా అనే ఈ కేరళ కుట్టి కూడా నటించి మెప్పించింది.

    Also Read: అదనంగా డబ్బులు ఇస్తేనే ముద్దులు పెడతాను !

    ఆ సినిమా విజయం సాధించినా.. ఆ సినిమాలో మడోన్నా అద్భుతంగా నటిచిందనే నేమ్ ఆమెకు వచ్చినా.. ఎందుకో ఈ బ్యూటీకి మాత్రం మళ్లీ తెలుగులో ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు. కాగా లాంగ్ గ్యాప్ తర్వాత మడోన్నా రెండో తెలుగు సినిమా సైన్ చేసిందని తెలుస్తోంది. నాని హీరోగా ఈ రోజు లాంచ్ అయిన “శ్యామ్ సింగ రాయ్” అనే సినిమాతో ఆమె టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతుందని.. ఆమెకు అవకాశం రావడానికి ముఖ్య కారణం నానినే అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్స్ గా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. మూడో భామగా మాత్రమే మడోన్నాకి ఛాన్స్ దక్కింది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా ఎమోషన్ ఓ రేంజ్ లో.. !

    కానీ సినిమాలో ఆమె పాత్ర చాల కీలకం అని.. కాస్త బోల్డ్ గా ఈ సినిమాలో మడోన్నా కనిపించబోతుందని సమాచారం. నిజానికి ఈ పాత్రకి మొదట నివేధా థామస్ కానీ, అదితి రావుని కానీ తీసుకుందామని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు. ఫ్రెష్ లుక్ రావాలంటే ఇంతకుముందు నాతో నటించని హీరోయిన్ అయితేనే బాగుంటుంది అని నాని, మడోన్నాకి ఛాన్స్ ఇప్పించాడట. అన్నట్లు మడోన్నా తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా మలయాళంలో మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీకి ఫుల్ పాపులారిటీ ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్