ఎడారిలో మియా మాల్కోవా అందాలు.. చూడాల్సిందే..

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా కేవలం రెండ్రోజుల్లో మినియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ తర్వాత మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ […]

Written By: Neelambaram, Updated On : May 23, 2020 7:21 pm
Follow us on


సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘క్లైమాక్స్’. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో సస్పెన్స్ థిల్లర్ గా ‘క్లైమాక్స్’ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేయగా కేవలం రెండ్రోజుల్లో మినియన్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ తర్వాత మియా మాల్కోవాపై షూట్ చేసిన ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే మ్యూజికల్ వీడియో, క్లైమాక్స్ ట్రైలర్ ను విడుదల చేసి సినిమాలపై అంచనాలను పెంచేశాడు. ఈ మూవీని మే 29న ఉదయం 11గంటలకు వర్మ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ యాప్ లో విడుదల చేయనున్నాడు. తాజాగా కొద్దిసేపటి క్రితమే వర్మ తన ట్వీటర్లో ‘జస్ట్ డూ ఇట్.. ప్రీక్ అవుట్’ అనే ఫుల్ వీడియోను రిలీజ్ చేశాడు.

సస్సెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని పూర్తిగా ఎడారిలో చిత్రీకరించారు. మియా మాల్కోవా అందాలు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా రిలీజైన సాంగులో మియా మాల్కోవా అందాలు అభిమానులను కనువిందు చేశాయి. ఎడారి ఇసుక తిన్నెల్లో మియా మాల్కోవా అందాలను వర్మ పూర్తిగా చూపించేశారు. చాలా స్టైలీష్ గా, హాలీవుడ్ స్టైల్లో క్లైమాక్స్ మూవీని వర్మ తెరకెక్కించాడు. ‘జస్ట్ డూ ఇట్.. ఫ్రీక్ అవుట్’ అనే సాంగ్ పూర్తిగా ఇంగ్లీషులో ఉంది. ఈ పాటను రవిశంకర్ సంగీతం అందించగా భారతి గుప్త అలపించాడు. వర్మ గతంలోనూ మియా మాల్కోవాతో జీఎస్టీ అనే మూవీని తెరకెక్కించారు. ఇందులో మియా మాల్కోవాను నగ్నంగా చూపించడంతో మహిళ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని వర్మ తనదైన శైలిలో తిప్పికొట్టారు.

ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ‘క్లైమాక్స్’ మూవీపై ఎలాంటి విమర్శలు, వ్యతిరేకతలు కన్పించడం లేదు. దీంతో వర్మ కొత్త పద్ధతుల్లో ‘క్లైమాక్స్’ మూవీకి ప్రమోషన్ చేస్తున్నారు. రిలీజైన గంటసేపట్లోనే ఈ వీడియోను సుమారు 30వేల మంది చూశారు. రెండ్రోజుల్లోనే ‘క్లైమాక్స్’ టీజర్ మిలియన్ వ్యూస్ సాధించగా ఈ సాంగ్ ఒక్కరోజులోనే మిలియన్ వ్యూస్ సాధించడం ఖాయంగా కన్పిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్లో దూసుకెళుతోంది.