జియో అందించే ఆఫర్ల వల్ల ఇతర కంపెనీలు సైతం ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇప్పటికే పలు నగరాల్లో ప్రవేశపెట్టగా ఎక్కువమంది జియో ఫైబర్ సేవలను వినియోగిస్తున్నారు. జియో ఫైబర్ కస్టమర్లకు ఓటీటీ సర్వీసులను, ఉచిత హెచ్‌డీ వాయిస్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నేట్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, సెక్యూరిటీ సేవలను కూడా అందిస్తుండటం గమనార్హం.
రూ. 999,1499,2499 డేటా ప్యాకేజీలు ఎక్కువగా యూజర్లను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా జియో 199 రూపాయలకే జియో ఫైబర్ ద్వారా 1000 జీబీ డేటాను అందిస్తోంది. సాచెట్ ట్యాక్స్‌తో కలిపి 234.82 రూపాయలు చెల్లించడం ద్వారా ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. 1 టీబీ డేటా 100 ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో అందుబాటులోకి వస్తుండగా ఈ డేటా ప్యాకేజీ వ్యాలిడిటీ కేవలం 7 రోజులు మాత్రమే ఉండనుంది.
డేటా ప్యాక్ ముగిసిన తరువాత 1 ఎమ్‌బీపీఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తుంది. కొత్తకొత్త ఆఫర్ల ద్వారా జియో యూజర్లకు ప్రయోజనం చేకూరుస్తుండటం గమనార్హం.